Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఓలా సాయం.. ఉచితంగా ఇంటికి ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు

హైదరాబాద్‌ సిటీ : ఓలా యాప్‌ ద్వారా కొద్దిపాటి వివరాలు అందిస్తే కరోనా బాధితుల ఇంటి వద్దకే ఉచితంగా ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్‌లను అందించేందుకు ఓలా ఫౌండేషన్‌ ముందుకు వచ్చింది. తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా 500 ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్‌లను ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ ఆధ్వర్యంలో ప్రారంభించింది. ఈ సందర్భంగా జయేష్‌రంజన్‌ మాట్లాడుతూ.. కరోనా తీవ్ర లక్షణాలతో బాధపడిన వారికి, చికిత్స పొంది ఆస్పత్రి నుంచి ఇంటికివచ్చినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఓలా సీఓఓ గౌరవ్‌ పర్వాల్‌ మాట్లాడుతూ అవసరాన్ని బట్టి కాన్‌సన్‌టేటర్ల సంఖ్యను పెంచుతామన్నారు. ఓలా యాప్‌లో వివరాలను నమోదు చేస్తే ఇంటి వద్దకే ఉచితంగా ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్‌లను అందిస్తామన్నారు.

Advertisement
Advertisement