చిన్న గాలి వీస్తేనే కూలిపోయే ఇల్లు.. ఒక్క బెడ్‌రూం కూడా లేదు.. రూ. 14 కోట్లకు అమ్ముడుపోయింది..!

ABN , First Publish Date - 2022-01-21T01:57:21+05:30 IST

ఎప్పుడో 120 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు.. అందులో ఒక్క బెడ్‌రూం కూడా లేదు. దాని అద్దాలన్నీ విరిగిపోయాయి. అసలు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆ ఇంటికి మరమ్మతులు చేయలేదనిపించేలా ఉంటుంది దాని లుక్. అటువంటి ఇంటిని..ఏకంగా..

చిన్న గాలి వీస్తేనే కూలిపోయే ఇల్లు.. ఒక్క బెడ్‌రూం కూడా లేదు.. రూ. 14 కోట్లకు అమ్ముడుపోయింది..!

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడో 120 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు.. అందులో ఒక్క బెడ్‌రూం కూడా లేదు. దాని అద్దాలన్నీ విరిగిపోయాయి. అసలు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆ ఇంటికి మరమ్మతులు చేయలేదనిపించేలా ఉంటుంది దాని లుక్. పాడుబడ్డ ఆ ఇల్లు చిన్న గాలి వీస్తేనే కూలిపోయాలా ఉంటుంది. అటువంటి ఇల్లు ఇటీవల ఏకంగా 1.97 మిలియన్ డాలర్లకు(సుమారు రూ. 14 కోట్లు) అమ్ముడుపోయింది. వినడానికి కాస్త షాకింగ్‌గా ఉన్నా ఇది వాస్తవం. అమెరికాలోని శాన్‌ఫ్రాన్‌సిస్కో నగరంలోగల నోయీ వ్యాలీలో ఉందీ ఆ కోట్లు విలువ చేసిన ఇల్లు. ఇది సంపన్న వర్గాలు ఉండే ప్రాంతం. రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ఆలాంటి ప్రాంతంలో ఉన్న దీన్ని వేలం వేయడంతో.. సహజంగానే భారీ ధరకు అమ్ముడుపోయింది. 


ముందు ప్రకటించిన ధరకంటే ఏకంగా 6 లక్షల డాలర్ల అధిక ధర పలికింది. స్థానికులు ఈ ఇంటిని ఓ చెత్త కొంపగా అభివర్ణిస్తుంటారు. ఆ ప్రాంతానికి ఓ మచ్చగా ఉంటుందీ ఇల్లు. అంతేకాదు.. ఇందులో కేవలం ఒక్క కుటుంబం మాత్రమే నివసించే స్థలం ఉంది. ఇటువంటి ఇల్లు ఇంత భారీ ధరకు అమ్ముడుపోయిందని తెలిసిన వెంటనే నెటిజన్లు.. ఈ వేలం వెర్రి ఏంటంటూ తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ఇటువంటి ప్రాంతంలో ఉండేకంటే మరోచోటకి వెళ్లిపోవడమే మంచిదని అనేక మంది అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-01-21T01:57:21+05:30 IST