Abn logo
Sep 23 2021 @ 09:27AM

దారుణం.. తలను నరికి వెంట తీసుకెళ్ళిన హంతకులు

             - దిండుగల్‌లో వృద్ధురాలి దారుణహత్య


చెన్నై: దిండుగల్‌ సమీపం శెట్టినాయకన్‌పట్టిలో పాతకక్షల నేపథ్యంలో ఓ వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. ఆ వృద్ధురా లు మృతి చెందిన తర్వాత హంతకులు తలను నరికి చేతపట్టుకుని పారిపోయారు. పదేళ్ళకు ముందు ఆ ప్రాంతంలోనే దేవేంద్రకుల వెల్లాలర్‌ సంఘం నాయకుడు పశుపతి పాండ్యన్‌ను కొంత మంది వేటకొడవళ్ళతో దాడి జరిపి హత్య చేశారు. ఆ హత్యకేసులో పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో శెట్టినాయకన్‌పట్టికి చెందిన నిర్మలా దేవి(65) అనే వృద్ధురాలు ఉన్నారు. పశుపతి పాండ్యన్‌ గుర్తించేందుకు సహకరించిందని, హంత కులకు తన ఇంట ఆశ్రయమిచ్చిందని ప్రత్యర్థులు ఆమెపై అనుమానాలు పెంచుకున్నారు. ఆమెను చంపేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నిర్మలాదేవి అరివుతిరుక్కోవిల్‌ సమీపంలో నడచి వెళుతుండగా గుర్తు తెలియిన వ్యక్తులు ఆమెపై కత్తులతో దాడి చేశారు ఆ స్థలంలోనే ఆమె మరణించింది. హంతకులు నిర్మలాదేవి మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత ఆమె తలను కత్తితో నరికి తమ వెంట తీసుకుని పారిపోయారు. ఈ సమాచారం తెలుసుకుని తాడికొంబు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని నిర్మలాదేవి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం దిండుగల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. హంతకుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

క్రైమ్ మరిన్ని...