అత్యాచారయత్నం కేసులో వృద్ధుడిపై పోక్సో కేసు

ABN , First Publish Date - 2020-02-02T05:48:09+05:30 IST

బాలికపై అత్యాచారానికి యత్నించిన వృద్ధుడిపై నేరేడ్‌మెట్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అంబేడ్కర్‌నగర్‌లో

అత్యాచారయత్నం కేసులో వృద్ధుడిపై పోక్సో కేసు

బాలికపై అత్యాచారానికి యత్నించిన వృద్ధుడిపై నేరేడ్‌మెట్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అంబేడ్కర్‌నగర్‌లో ఉంటున్న హైదర్‌ అలియాస్‌ యూసుఫ్‌(74) జనవరి 30వ తేదీన ఓ బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2020-02-02T05:48:09+05:30 IST