బ్రిటన్‌లో ఓ పాత టీవీ ఏం చేసిందంటే!

ABN , First Publish Date - 2020-09-24T03:01:12+05:30 IST

బ్రిటన్‌లో ఎబోరోసన్ అనే మారుమూల గ్రామం ఉంది. ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ఓ ప్రముఖ బ్రాడ్‌బ్యాండ్ సంస్థ ఇంటర్నెట్ సదుపాయం కలిపిస్తోంది. అయితే గ

బ్రిటన్‌లో ఓ పాత టీవీ ఏం చేసిందంటే!

బ్రిటన్: బ్రిటన్‌లో ఎబోరోసన్ అనే మారుమూల గ్రామం ఉంది. ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ఓ ప్రముఖ బ్రాడ్‌బ్యాండ్ సంస్థ ఇంటర్నెట్ సదుపాయం కలిపిస్తోంది. అయితే గత 18 నెలలుగా ఆ గ్రామానికి సరిగ్గా ఉదయం 7 గంటలకు.. ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అవుతోంది. తిరిగి ఎప్పుడో మళ్లీ.. వారికి ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామస్థులు తమ సమస్యను సంస్థ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బ్రాడ్‌బ్యాండ్ సంస్థ ఇంజినీర్లు రంగంలోకి దిగారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటలకే ఎబోరోసన్ గ్రామంలో ఎందుకు ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అవుతుందన్న అంశంపై వారు దృష్టిపెట్టి, చివరికి కారణం తెలుసుకున్నారు. దానికి కారణం ఓ పాత టీవీ అని, దాన్ని ఓ పెద్దాయన సరిగ్గా ఉదయం ఏడు గంటలకే ఆన్ చేయడం వల్ల అదే సమయానికి గ్రామంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతున్నాయని తెలుకుని వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. టీవీ నుంచి వెలువడే శబ్దతరంగాల వల్ల అనవసర విద్యుత్ ప్రసరణ జరిగి, ఇంటర్నెట్‌‌ కనెక్షన్ పోతుందని గుర్తించారు. ఈ నేపథ్యంలో సదరు టీవీ యజమానులకు బ్రాండ్ బ్యాండ్ సంస్థకు చెందిన ఇంజినీర్లు సమస్యను వివరించి.. దాన్ని ఉపయోగించొద్దని సూచించారు. దానికి వారు అంగీకరించడంతో.. ఎబోరోసన్ గ్రామస్థుల సమస్య తీరింది. 


Updated Date - 2020-09-24T03:01:12+05:30 IST