ఏపీలో ఇష్టారాజ్యంగా పెన్షన్లు తొలగింపు

ABN , First Publish Date - 2021-09-13T19:10:02+05:30 IST

ఏపీలో అధికారులు ఇష్టారాజ్యంగా పెన్షన్లు తొలగిస్తున్నారు. 70 ఏళ్ల వయసు ఉన్న బామ్మకు పెన్షన్ కట్ చేశారు.

ఏపీలో ఇష్టారాజ్యంగా పెన్షన్లు తొలగింపు

అనంతపురం: ఏపీలో అధికారులు ఇష్టారాజ్యంగా పెన్షన్లు తొలగిస్తున్నారు. 70 ఏళ్ల వయసు ఉన్న బామ్మకు పెన్షన్ కట్ చేశారు. ఎందుకు పెన్షన్ రావడంలేదని అడిగితే ఆధార్ కార్డులో ఆమె వయసు 16 ఏళ్లే ఉన్నాయని అందుకే పెన్షన్ కట్ చేసినట్లు అధికారులు చెప్పారు. గత 30 ఏళ్ల నుంచి ఆమె తీసుకుంటున్న పెన్షన్‌ను అధికారులు తొలగించారు. పెన్షన్లను ఎంత దారుణంగా తొలగిస్తున్నారో చెప్పడానికి ఇదొక నిదర్శనం.


అనంతపురం జిల్లా ఉరవకొండలోని గాంధీచౌక్ ఏరియాలో షేక్ అమినబీ  ఉంటోంది. ఆమె వయసు 70 ఏళ్లు. 30 ఏళ్ల క్రితం ఆమె భర్త మరణించారు. అప్పటి నుంచి ఆమె పెన్షన్ తీసుకుంటోంది. రెండు నెలల క్రితం ఒక్కసారిగా పెన్షన్ కట్ చేశారు. ఎందుకు తొలగించారని అధికారులను అడిగింది. వారు చెప్పిన సమాధానంతో అంతా షాకయ్యారు. ఆమె వయసు జస్ట్ 16 ఏళ్లేనట.. ఆధార్ కార్డులో అలాగే ఉందట. ఆ షాకు చూపి పెన్షన్ కట్ చేశారు. క్షేత్ర స్థాయిలో సర్వే చేయకుండా, ఆమె వయస్సు తెలుసుకోకుండా గుడ్డిగా పెన్షన్ తొలగించారు. ఇదీ ప్రభుత్వం తీరు...

Updated Date - 2021-09-13T19:10:02+05:30 IST