పాత మోబైల్‌ నంబర్లతోనూ హ్యాక్‌ చేయొచ్చు!

ABN , First Publish Date - 2021-05-08T05:45:12+05:30 IST

పాత ఫోన్‌ నెంబర్లతోనూ హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందంటున్నారు టెక్‌ అనలిస్టులు.

పాత మోబైల్‌ నంబర్లతోనూ హ్యాక్‌ చేయొచ్చు!

పాత ఫోన్‌ నెంబర్లతోనూ హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందంటున్నారు టెక్‌ అనలిస్టులు. ఈ నంబరుతో కొన్ని సందర్భాల్లో చిక్కులు ఎదురవుతున్నాయని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా కస్టమర్‌ వదిలేసిన నంబర్లను కొత్తవారికి అలాట్‌ చేస్తారు. టెలీకామ్‌ టర్మినాలజీలో దీన్ని ఫోన్‌ నంబర్‌ రీసైక్లింగ్‌ అంటారు. కొన్ని సందర్భాల్లో ఈ రీసైక్లింగ్‌ ప్రమాదకరం, భద్రతపరంగా రిస్క్‌ అయ్యే అవకాశం ఉందని రీసెర్చర్లు తేల్చారు. వీరు అలాంటి 259 రీసైక్లింగ్‌ ఫోన్‌ నంబర్లను తీసుకుని పరిశోధించారు. ఈ వీటిని కొత్త కస్టమర్లు ఉపయోగిస్తున్నారు. వాటిలో 171 నెంబర్లు పాపులర్‌  వెబ్‌ సైట్లతో కనెక్ట్‌ అయి ఉన్నాయి.  వీటిలో ఎక్కువ పాపులర్‌ సెర్చ్‌ సర్వీసులను హిట్‌ చేశాయి. వీటి ఆధారంగా నెంబర్ల పాత వినియోగదారుల సమాచారాన్ని అందిపుచ్చుకునేందుకు ఇవి దోహదపడ్డాయి.


ఈ 259లో సరిసంఖ్య  కలిగిన వంద వరకు నంబర్లు వెబ్‌ లాగిన్‌ ద్వారా సమాచారం లీక్‌ అయ్యేందుకు వీలుగా ఉన్నాయి.  అలాగే ఆ పాత నంబరు టెక్‌సావీ అయిన వ్యక్తి చేతిలో పడితే మరింతగా దుర్వినియోగమయ్యే అవకాశాలూ ఉన్నాయి. సాధారణంగా పాత నంబర్లను వదిలించుకున్న కస్టమర్లు తమ ఆన్‌లైన్‌ అకౌంట్లతో దానికి ఉన్న లింకును మర్చిపోతుంటారు. దాంతో డబుల్‌ ఐడెంటిఫికేషన్‌ సమస్యలు ఎదురవుతాయి.  పాత నంబరును వదిలించుకున్న వెంటనే ఆన్‌లైన్‌ వ్యవహారాలను తొలగించుకోవాలి. లేదంటే కొత్త నంబర్లతో అప్‌డేట్‌ చేసుకోవాలని ఈ పరిశోధకులు   సూచిస్తున్నారు.

Updated Date - 2021-05-08T05:45:12+05:30 IST