నూరేళ్ల ఆయుష్షు పూర్తిచేసుకున్న బ్రిటన్ దంపతులు.. దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడానికి వారి రహస్యమేంటో తెలుసా..

ABN , First Publish Date - 2022-01-18T09:59:08+05:30 IST

పెళ్లంటే మూణాళ్ల ముచ్చటగా సాగి.. పెటాకులవుతున్న ఈ రోజుల్లో ఒక జంట 81 ఏళ్లుగా తమ వైవాహిత జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా కొనసాగిస్తోంది. కలతలు లేని బంధాన్ని సాగిస్తున్న ఈ భార్యభర్తలిద్దరూ నిండు నూరేళ్లు పూర్తిచేసుకోవడం గమనార్హం. అంతే కాదు బ్రిటన్‌లోనే అత్యధిక కాలం కలిసున్న జంటగా ఈ ఆలుమగలు రికార్డులకెక్కారు...

నూరేళ్ల ఆయుష్షు పూర్తిచేసుకున్న బ్రిటన్ దంపతులు.. దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడానికి వారి రహస్యమేంటో తెలుసా..

పెళ్లంటే మూణాళ్ల ముచ్చటగా సాగి.. పెటాకులవుతున్న  ఈ రోజుల్లో ఒక జంట 81 ఏళ్లుగా తమ వైవాహిత జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా కొనసాగిస్తోంది. కలతలు లేని బంధాన్ని సాగిస్తున్న ఈ భార్యభర్తలిద్దరూ నిండు నూరేళ్లు పూర్తిచేసుకోవడం గమనార్హం. అంతే కాదు బ్రిటన్‌లోనే అత్యధిక కాలం కలిసున్న జంటగా  ఈ ఆలుమగలు రికార్డులకెక్కారు. బ్రిటన్‌లోని 1941వ సంవత్సరం బకింగ్‌హంషైర్‌లో ఒక్కటైన ఈ జంట 2022 జనవరి 4న తమ 81వ వివాహ వార్షికోత్సవం జరుపుకోగా.. వీరికి బ్రిటన్ రాణి ఎలిజబెత్ పర్సనల్‌గా అభినందనలు తెలిపింది.


వివరాల్లోకి వెళితే.. రాన్ బాండ్(100) అన ప్రియురాలు జాయిస్ బాండ్(102)ని 1941 జనవరి 4న ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకునే సమయంలో ఇంత దీర్ఘకాలం కలిసి ఉంటారని స్నేహితులెవరూ ఊహించలేదు. పెళ్లి అయిన వెంటనే రాన్ రెండో ప్రపంచ యుద్ధంతో పాల్గొనేందుకు వెళ్లాడు. శతాధిక వయసున్న రాన్, జాయిన్ జంటకు ఇద్దరు సంతానం. ముగ్గురు మనవళ్లు, ఆరుగురు మునివనవళ్లు, ఒక ముని మునిమనవడు ఉన్నారు. వీరిద్దరూ ఇంతకాలం కలిసి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి 


రహస్యాలేంలో కూడా చెప్పుకొచ్చారు. తాము తొలిచూపులోనే ప్రేమలో పడ్డామని.. అప్పటి నుంచి ఇప్పటివరకూ అదే అనోన్యతతో తమ బంధాన్ని కొనసాగిస్తున్నామని వారు చెప్పారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి ఈగోలు లేవని జాయిస్ చెప్పింది. తమ బంధంలో ఎవరూ బాస్ కాదని, ఒకరినొకరు గౌరవించుకొని.. ఇచ్చుపుచ్చుకునే ధోరణితో మెలుగుతామని ఆమె తెలిపింది. 


81 ఏళ్లు సంతోషంగా కలిసి జీవిస్తామని తాము ఊమించలేదని, ఇంతకాలం జంటగా జీవించినందుకు తమ అదృష్టంగా భావిస్తానని రాన్ చెప్పుకొచ్చాడు. ఇన్నేళ్ల తమ సంసార జీవితంలో ఎన్నడూ గొడవ పడలేదని, అవగాహనతో ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకెళ్లామని అదే తమ సుదీర్ఘ దాంపత్య జీవితానికి రహస్యమని ఈ భార్యభర్తలు చెప్పారు. 


వీరిద్దరి పిల్లలో ఒకరైన ఎలీన్ మాట్లాడుతూ.. "మా నాన్న కుటుంబాన్ని ఆర్థికంగా ఉన్నతస్థితికి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడ్డారు. మరోవైపు మా అమ్మ ఇంటిని ఒకటిగా ఉంచేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది" అని చెప్పింది.




Updated Date - 2022-01-18T09:59:08+05:30 IST