Abn logo
Jul 24 2021 @ 16:55PM

Blue Origin స్పేస్ ట్రిప్‌లో జెఫ్ బెజోస్‌కు షాకిచ్చిన 18ఏళ్ల కుర్రాడు

న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం వరకు పైన ఫొటోలో కనిపిస్తున్న 18ఏళ్ల యువకుడు ఎవరో ఎవ్వరికీ తెలియదు. కానీ గత మంగళవారం నుంచి అతని పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ నెల 20న అపర కుబేరుడు బ్లూ ఆరిజిన్ అధిపతి జెఫ్ బెజోస్‌తో అంతరిక్షయానం చేసి, రోదసీ యాత్ర చేసిన అతిచిన్న పిన్న వయస్కుడిగా గుర్తింపుపొందడంతో.. ప్రస్తుతం అందిరికీ సుపరిచితం అయ్యాడు. దీంతో ఇతన్ని డచ్‌కు చెందిన ఆలివర్ డెమెన్‌గా గుర్తుపట్టేస్తున్నారు. అవును.. అతడ్ని మేము కూడా గుర్తుపట్టాంలే కానీ ఇంతకీ విషయం ఏంటనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నా. 18ఏళ్ల ఆలివర్ డెమెన్ తన స్పేస్ ట్రిప్‌నకు సంబంధించిన విశేషాలను తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు. స్పేస్ ట్రిప్ సమయంలో బ్లూ ఆరిజిన్ అధిపతి, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు తాను ఓ షాకింగ్ న్యూస్ చెప్పినట్టు వెల్లడించారు.


జెఫ్ బెజోస్‌కు తనకు మధ్య జరిగిన సంభాషణ సందర్భంగా తాను ఇంత వరకు అమెజాన్‌లో ఏ వస్తువునూ కొనుగోలు చేయలేదని చెప్పేశారట. ఆలివర్ డెమెన్ నోటి నుంచి ఈ మాటలు వెలువడటంతో జెఫ్ బెజోస్ ఒక్కసారిగా షాకయ్యాడట. అంతేకాకుండా ‘హో.. వావ్. అమెజాన్ నుంచి ఇప్పటి వరకు ఏ వస్తువు కూడా కొనుగోలు చేయలేదని ఓ వ్యక్తి చెప్పడాన్ని చాలా రోజుల తర్వాత వింటున్నా’ అని పేర్కొన్నారట. 


తాజా వార్తలుమరిన్ని...