OLX లో అమ్మకానికి టీవీ, దివాన్‌ సెట్‌.. క్యూఆర్ కోడ్ పంపగా.. నిమిషాల్లోనే..!

ABN , First Publish Date - 2021-11-13T14:29:07+05:30 IST

ఓఎల్‌ఎక్స్‌లో పెట్టిన టీవీ, దివాన్‌ సెట్‌ కొనుగోలు చేస్తామని..

OLX లో అమ్మకానికి టీవీ, దివాన్‌ సెట్‌.. క్యూఆర్ కోడ్ పంపగా.. నిమిషాల్లోనే..!

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : ఓఎల్‌ఎక్స్‌లో పెట్టిన టీవీ, దివాన్‌ సెట్‌ కొనుగోలు చేస్తామని సైబర్‌ నేరగాళ్లు రూ. 72 వేలు స్వాహా చేశారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12లో నివాసముండే షాఫిల్లి జైస్వాల్‌ ఓ కంపెనీలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. తన ఇంట్లో ఉన్న టీవీ, దివాన్‌ సెట్‌ను అమ్మకానికి ఓఎల్‌ఎక్స్‌లో పోస్టు చేశారు. అజయ్‌రావత్‌ అనే వ్యక్తి వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపి, ఆమె ఫోన్‌ నెంబర్‌కు రూ.2 గూగుల్‌ పే చేశారు. మిగతా డబ్బులు చెల్లించేందుకు క్యూఆర్‌ కోడ్‌ పంపించాడు. జైస్వాల్‌ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయగా పలు దఫాలుగా ఆమె ఖాతాలో నుంచి రూ. 72 వేలు డ్రా అయ్యాయి. మోసపోయినట్టు గ్రహించిన ఆమె బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-13T14:29:07+05:30 IST