ఒలింపియన్ నీరజ్ చోప్రాకు ‘పరమ విశిష్ట సేవా పతకం’

ABN , First Publish Date - 2022-01-26T00:11:09+05:30 IST

టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా మరో అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నాడు. గణతంత్ర దినోత్సవం

ఒలింపియన్ నీరజ్ చోప్రాకు ‘పరమ విశిష్ట సేవా పతకం’

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా మరో అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నాడు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ’పరమ విశిష్ట సేవా పతకం’ అందుకోబోతున్నాడు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేడు 384 మంది రక్షణ సిబ్బందికి గ్యాలంట్రీతోపాటు ఇతర అవార్డులు ఇవ్వనున్నారు.


వీటిలో 12 శౌర్యచక్ర, 29 పరమ విశిష్ట సేవా పతకాలు, నాలుగు ఉత్తమ యుద్ధ సేవా పతకాలు, 53 అతి విశిష్ట సేవా పతకాలు, 13 యుద్ధ సేవా మెడల్స్, మూడు బార్ టు విశిష్ట  సేవా పతకాలు ఉన్నాయి. అలాగే, 122 మంది విశిష్ట సేవా పతకాలు,  మూడు బార్ టు సేన పతకాలు (శౌర్యం), 81 సేనా పతకాలు (శౌర్యం), రెండు వాయు సేన పతకాలు (శౌర్యం), 40 సేనా పతకాలు (విధులపై విధేయత), ఎనిమిది నావో సేన పతకాలు, 14 వాయు సేనా పతకాల విజేతలను రాష్ట్రపతి సత్కరిస్తారు.   


Updated Date - 2022-01-26T00:11:09+05:30 IST