మనసులోనే ఎగిరి గంతేయాలి

ABN , First Publish Date - 2021-06-24T08:47:54+05:30 IST

భారత జట్టు వరల్డ్‌కప్‌ గెల్చినప్పుడు హీరోయిన్‌ శ్రుతీ హాసన్‌ కుటుంబ సభ్యులు ఆ ఆనందోత్సాహాల్ని ఏ మాత్రం బయటికి కనిపించనీయకుండా మనసులోనే ఎగిరి గంతేస్తారు.

మనసులోనే ఎగిరి గంతేయాలి

 విశ్వక్రీడల్లో నో చీర్స్‌, నో ఆటోగ్రాఫ్స్‌


టోక్యో: రేసు గుర్రం సినిమా గుర్తుందిగా...ఒలింపిక్స్‌ మరో 29 రోజుల్లో భారత జట్టు వరల్డ్‌కప్‌ గెల్చినప్పుడు హీరోయిన్‌ శ్రుతీ హాసన్‌ కుటుంబ సభ్యులు ఆ ఆనందోత్సాహాల్ని ఏ మాత్రం బయటికి కనిపించనీయకుండా మనసులోనే ఎగిరి గంతేస్తారు. సరిగ్గా ఒలింపిక్స్‌కు వెళ్లే అభిమానులు కూడా ఇలాగే చేయాల్సిన పరిస్థితి. తమ అభిమాన అథ్లెట్‌ పతకం గెలిచినా ఆహా.. ఓహా అనడాలూ, ఎగిరి గంతేయడాలూ, పిచ్చిపిచ్చిగా కేకలు వేయడాలూ చేయకూడదు. ఏది చేసుకున్నా.. అన్నీ మనసులోనే చేసుకోవాలి. కరోనా నేపథ్యంలో ఒలింపిక్‌ కమిటీ తాజా రూలు ఇది. ఒలింపిక్స్‌ ఒక్కో క్రీడా వేదికలో 10 వేల మందికి అనుమతించిన నిర్వాహక కమిటీ అదే సమయంలో ఫ్యాన్స్‌ సంబరాలపై కఠిన ఆంక్షలు విధించింది.


తమ అభిమాన అథ్లెట్‌ పతకం గెలిస్తే ఆ ఆనందాన్ని మనసులోనే ఉంచుకోవాలి తప్ప హావభావాలతో బయటకు వ్యక్తీకరించకూడదు. అంటే.. తోటి ఫ్యాన్స్‌తో చేతులు కలపడం, అథ్లెట్ల ఆటోగ్రా్‌ఫలు అడగ డం, మాటలతో వారిని అభినందించడం నిషేధం. ఎలాంటి సంబరమైనా అది ప్రజలు గుమిగూడేందుకు దారితీస్తుందని భయపడుతున్న నిర్వాహకులు వాటిని నిషేధించారు. పోటీలు ముగియగానే నేరుగా ఇళ్లకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. వేదికల వద్ద మద్యం అమ్మకాలను కూడా నిషేధించారు. మద్యం తాగే సమయంలో ఒకరికొకరు దగ్గరిగా మసలే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశముంటుందన్నది నిపుణుల కమిటీ అభిప్రాయం. 

Updated Date - 2021-06-24T08:47:54+05:30 IST