మ‌రో రెండు క‌రోనా టీకాల‌కు ఒమ‌న్ ఆమోదం

ABN , First Publish Date - 2021-06-25T16:27:42+05:30 IST

ప్రపంచ దేశాల్లో క‌రోనా డెల్టా వేరియంట్ ఆందోళ‌న క‌లిగిస్తున్న నేప‌థ్యంలో తాజాగా గ‌ల్ఫ్ దేశం ఒమ‌న్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసేందుకు మ‌రో రెండు టీకాల‌కు అత్యావ‌స‌ర వినియోగానికి ఆమోదం తెలిపింది.

మ‌రో రెండు క‌రోనా టీకాల‌కు ఒమ‌న్ ఆమోదం

మ‌స్క‌ట్: ప్రపంచ దేశాల్లో క‌రోనా డెల్టా వేరియంట్ ఆందోళ‌న క‌లిగిస్తున్న నేప‌థ్యంలో తాజాగా గ‌ల్ఫ్ దేశం ఒమ‌న్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసేందుకు మ‌రో రెండు టీకాల‌కు అత్యావ‌స‌ర వినియోగానికి ఆమోదం తెలిపింది. ఇప్ప‌టికే ఫైజ‌ర్‌-బ‌యోఎన్‌టెక్‌, అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల‌ను వినియోగిస్తున్న ఒమ‌న్ తాజాగా సినోవాక్‌, స్పుత్నిక్ టీకాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. బీటా, గామా, ఆల్ఫా వేరియంట్ల‌కు తోడుగా ఇప్పుడు డెల్టా కేసులు కూడా బ‌య‌ట‌ప‌డ‌డంతో ఒమ‌న్ వైద్య‌శాఖ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇక డెల్టా వేరియంట్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతున్న విష‌యం తెలిసిందే. దీంతో దేశంలో మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరిగే అవ‌కాశం ఉన్నందున అప్ర‌మ‌త్త‌మైన ఆ దేశ‌ ఆరోగ్య‌శాఖ వేగంగా మెజారిటీ గ్రూపు ప్ర‌జ‌ల‌కు వ్యాక్సినేష‌న్ పూర్తి చేయాల‌నే ఉద్దేశంతో ఈ రెండు టీకాల‌కు ఆమోదం తెలిపింది. 


Updated Date - 2021-06-25T16:27:42+05:30 IST