కర్ఫ్యూ ఆంక్షలను పొడిగించిన ఒమన్ !

ABN , First Publish Date - 2021-03-19T13:52:45+05:30 IST

గత కొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి గల్ఫ్ దేశం ఒమన్ పాక్షిక కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.

కర్ఫ్యూ ఆంక్షలను పొడిగించిన ఒమన్ !

మస్కట్: గత కొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి గల్ఫ్ దేశం ఒమన్ పాక్షిక కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సూపర్ మార్కెట్స్, మాల్స్, కాఫీ షాప్స్, హెల్త్ క్లబ్స్‌ను మూసి ఉంచుతున్నారు. తాజాగా ఆ దేశ సుప్రీం కమిటీ ఈ కర్ఫ్యూ ఆంక్షలను ఏప్రిల్ 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. తమ వద్ద ఉన్న డేటా ప్రకారం వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గలేదు కనుక ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో 70 శాతం ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని పేర్కొంది. అలాగే బీచ్‌లలో కూడా జనాలు గుమిగూడటాన్ని నిషేధించింది. కేవలం వ్యాయామ కార్యకలాపాలకు మాత్రమే బీచ్‌లను వినియోగించుకోవాలని సూచించింది. దేశ పౌరులు, నివాసితులు ఈ ఆంక్షలను తప్పకుండా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని సుప్రీం కమిటీ హెచ్చరించింది.       

Updated Date - 2021-03-19T13:52:45+05:30 IST