విదేశీ పెట్టుబ‌డిదారుల‌కు ఒమ‌న్ గుడ్‌న్యూస్‌!

ABN , First Publish Date - 2021-06-24T19:59:22+05:30 IST

గ‌ల్ఫ్ దేశం ఒమ‌న్ విదేశీ పెట్టుబ‌డిదారుల‌కు తీపి క‌బురు అందించింది. వీరికి దీర్ఘకాలిక వీసాలు ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

విదేశీ పెట్టుబ‌డిదారుల‌కు ఒమ‌న్ గుడ్‌న్యూస్‌!

మ‌స్క‌ట్: గ‌ల్ఫ్ దేశం ఒమ‌న్ విదేశీ పెట్టుబ‌డిదారుల‌కు తీపి క‌బురు అందించింది. వీరికి దీర్ఘకాల వీసాలు ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఫారిన్ ఇన్వెస్ట‌ర్ల‌తో పాటు నైపుణ్య రంగాల్లోని వారికి కూడా 5, 10 ఏళ్ల గ‌డువుతో లాంగ్ ట‌ర్మ్‌ వీసాలు జారీ చేస్తామ‌ని ఒమ‌న్ ప్ర‌క‌టించింది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నుంచి దీన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఒక‌వైపు ఒమ‌నైజేష‌న్‌లో భాగంగా స్థానికుల‌కు ఉపాధి అవ‌కాశాలు పెంచుతూనే మ‌రోవైపు విదేశీపెట్టుబ‌డులు, విదేశీయుల మేథోసంప‌తిని దేశ ప్ర‌యోజ‌నాల‌కు వినియోగించుకునేలా ఒమ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇక ఆ దేశ జ‌నాభాలో ఏకంగా 42 శాతం మంది ప్ర‌వాసులే ఉన్న విష‌యం తెలిసిందే. 

Updated Date - 2021-06-24T19:59:22+05:30 IST