Abn logo
Jun 12 2021 @ 09:45AM

ఒమ‌న్‌లో తెర‌చుకోనున్న దేవాల‌యాలు, చ‌ర్చిలు

మ‌స్క‌ట్‌: ఒమ‌న్‌లో క‌రోనా వ‌ల్ల‌ రెండు నెల‌లుగా తాత్కాలికంగా మూతప‌డ్డ దేవాల‌యాలు, చ‌ర్చిలు తిరిగి తెర‌చుకోనున్నాయి. దేశ‌వ్యాప్తంగా కొవిడ్‌-19 ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్న నేప‌థ్యంలో సుల్తానేట్ తిరిగి ఆల‌యాలు, చ‌ర్చిల‌ను తెర‌వాల‌ని నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా ద‌ర్సైత్‌లోని శ్రీ క్రిష్ణ ఆల‌యం, మ‌స్క‌ట్‌లోని శ్రీ శివాల‌యం ఇవాళ్టి(జూన్ 12) నుంచి తెర‌చుకుంటే.. చ‌ర్చిలు రేప‌టితో(జూన్ 13) తెర‌చుకోనున్నాయి. అయితే, ఆల‌యాలు, చ‌ర్చిల‌కు వ‌చ్చే వారు త‌ప్ప‌నిస‌రిగా ముఖానికి మాస్కు ధ‌రించ‌డం, సామాజిక దూరం పాటించాల‌ని సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే రెండు ఆల‌యాల్లో ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే భ‌క్తుల‌కు అనుమ‌తి ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయా దేవాల‌యాల మేనేజ్‌మెంట్స్ జారీచేసే గైడ్‌లైన్స్‌ను భ‌క్తులు త‌ప్ప‌కుండా ఫాలోకావాల‌ని ఆదేశించారు.