విమాన స‌ర్వీసుల పున‌రుద్ధ‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతున్న ఒమ‌న్‌

ABN , First Publish Date - 2020-06-05T16:34:09+05:30 IST

క‌రోనా సంక్షోభం నేప‌థ్యంలో ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించ‌డం వ‌ల్ల ఒమ‌న్ విమాన స‌ర్వీసుల‌ను నిలిపివేసింది.

విమాన స‌ర్వీసుల పున‌రుద్ధ‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతున్న ఒమ‌న్‌

మ‌స్క‌ట్: క‌రోనా సంక్షోభం నేప‌థ్యంలో ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించ‌డం వ‌ల్ల ఒమ‌న్ విమాన స‌ర్వీసుల‌ను నిలిపివేసింది. అయితే, లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను క్ర‌మంగా స‌డలిస్తున్న ఒమ‌న్ ప్ర‌భుత్వం విమాన స‌ర్వీసుల పున‌రుద్ధ‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతోంది. దేశంలో తిరిగి సాధార‌ణ జీవ‌నం సాగించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలిపిన ఆ దేశ‌ ఆరోగ్య‌శాఖ మంత్రి అహ్మ‌ద్ అల్ సైది త్వ‌ర‌లోనే విమాన స‌ర్వీసుల పున‌రుద్ధ‌ర‌ణ‌కు క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు చెప్పారు. అన్నీ కుదిరితే త్వ‌ర‌లోనే విమాన స‌ర్వీసులు ప్రారంభం అవుతాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. మ‌రోవైపు ఒమ‌న్‌లో చాప కింద నీరులా విస్త‌రిస్తున్న మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే 14,316 మందికి ప్ర‌బ‌లింది. మ‌రో 67 మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. 

Updated Date - 2020-06-05T16:34:09+05:30 IST