కనీస మద్దతు ధరపై కొందరు దుష్ప్రచారం: తోమర్

ABN , First Publish Date - 2021-09-09T00:13:25+05:30 IST

సాగు చట్టాలను ప్రవేశపెట్టిన తర్వాత కనీస మద్దతు ధరపై (ఎంఎస్‌పీ) కొందరు దుష్ట్రచారం సాగిస్తూ వచ్చారని..

కనీస మద్దతు ధరపై కొందరు దుష్ప్రచారం: తోమర్

న్యూఢిల్లీ: సాగు చట్టాలను ప్రవేశపెట్టిన తర్వాత కనీస మద్దతు ధరపై (ఎంఎస్‌పీ) కొందరు దుష్ట్రచారం సాగిస్తూ వచ్చారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. రైతుల నుంచి సేకరించే రబీ పంటల ఉత్పత్తుల కనీస మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం బుధవారం పెంచింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మీడియాతో తోమర్ మాట్లాడుతూ, ఎంఎస్‌పీని ఆపేస్తారంటూ కొందరు తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని, అయితే ఇందుకు భిన్నంగా ఎంఎస్‌పీ రేటు, ఎంఎస్‌పీతో పంటల సేకరణ అనేవి సాగు చట్టాల అమలు తర్వాత నిరాఘాటంగా పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు.


''ప్రస్తుత క్రాప్ ఇయర్‌లో 6 రబీ పంటలకు కనీస మద్దతు ధరను నిర్ణయించాం. 2022-23 సంవత్సరానికి గోధుమలు, ఆవాలకు 100 శాతం ఎంఎస్‌పీ పెరిగింది. గోధుమలు రూ.2,015, ఆవాలు రూ.5,050గా నిర్ణయమైంది. బార్లీ రూ.1,635కు పెరిగింది. చనా క్వింటాల్ రూ.5,230, మసూర్ దాల్ రూ.5,500గా నిర్ణయమైందని చెప్పారు. సన్‌ఫ్లవర్ రేటు 2021-22లో రూ5,327 కాగా, 50 శాతం పెంపు జరిగినట్టు తోమర్ తెలిపారు. 

Updated Date - 2021-09-09T00:13:25+05:30 IST