మరో ఐదుగురికి ఒమైక్రాన్‌

ABN , First Publish Date - 2021-12-31T17:36:39+05:30 IST

రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కేసులు క్రమేపీ పెరుగుతుండడంతో అధికారుల్లో ఆందోళన ప్రారంభమైంది. అమెరికా నుంచి దావణగెరెకు వచ్చిన 22ఏళ్ల యువతికి, అమెరికా నుంచి బెంగళూరుకు వచ్చిన 24ఏళ్ల యువకుడికి, ముంబై నుంచి

మరో ఐదుగురికి ఒమైక్రాన్‌

                         - రాజధానిలో కరోనా కలకలం 


బెంగళూరు: రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కేసులు క్రమేపీ పెరుగుతుండడంతో అధికారుల్లో ఆందోళన ప్రారంభమైంది. అమెరికా నుంచి దావణగెరెకు వచ్చిన 22ఏళ్ల యువతికి, అమెరికా నుంచి బెంగళూరుకు వచ్చిన 24ఏళ్ల యువకుడికి, ముంబై నుంచి తమిళనాడుకు వెడుతున్న 53ఏళ్ల వ్యక్తికి, దోహా ద్వారా ఘనా నుంచి బెంగళూరుకు విచ్చేసిన 61ఏళ్ల వ్యక్తికి, ముంబై నుంచి వచ్చిన 41ఏళ్ల వ్యక్తికి ఒమైక్రాన్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఒమైక్రాన్‌ బాధితుల సంఖ్య 43కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించారు. ఒమైక్రాన్‌ విషయంలో అప్రమత్తత పాటించాలని అధికారులకు సూచించారు. ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని, నూతన సంవత్సర వేడుకల పేరుతో గుమిగూడరాదన్నారు. బయటికి వచ్చే వేళ మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరంతో వ్యాధిని అరికట్టవచ్చన్నారు. కాగా గురువారం 707మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కాగా ఒక్క బెంగళూరులోనే 565 మందికి సోకడం గమనార్హం. దాదాపు 4 నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. 8 జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు. 21 జిల్లాల్లో 20 మందిలోపు నమోదయ్యారు. 252 మంది కోలుకున్నారు. బెంగళూరులో కొవిడ్‌తో ముగ్గురు మృతిచెందారు. 29 జిల్లాల్లో ఎవరూ మృతి చెందలేదు. ప్రస్తుతం 30 జిల్లాల్లో 8,223 మంది చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-12-31T17:36:39+05:30 IST