ఒమైక్రాన్ కేసులపై ఏపీ ప్రభుత్వంలో చలనం లేదు: అచ్చెన్న

ABN , First Publish Date - 2021-12-26T16:54:50+05:30 IST

ఏపీలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్నవైసీపీ ప్రభుత్వంలో చలనం లేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

ఒమైక్రాన్ కేసులపై ఏపీ ప్రభుత్వంలో చలనం లేదు: అచ్చెన్న

అమరావతి: ఏపీలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్నా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలకంటే కక్షసాధింపు చర్యలకే సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్‌లో ఏపీ వెనకబడి ఉందన్నారు.ఇతర రాష్ట్రాలు కరోనా కట్టడిలో ముందుంటే సీఎం జగన్ కక్షసాధింపు చర్యల్లో ముందున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు శూన్యమని చెప్పారు. వైద్యశాఖామంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చేసే మొక్కుబడి సమీక్షలతో ఒనగూరే ప్రయోజనం ఏంటి? అని అచ్చెన్నాయుడు నిలదీశారు.

Updated Date - 2021-12-26T16:54:50+05:30 IST