Gulf మీదుగా భారత్‌కు ఒమైక్రాన్‌!

ABN , First Publish Date - 2021-12-19T13:08:16+05:30 IST

తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఒమైక్రాన్‌ కేసులు క్రమేణా వెలుగులోకి వస్తుండగా.. వీరిలో ఎక్కువ శాతం గల్ఫ్‌ దేశాల మీదుగా భారత దేశానికి వస్తున్నవారే ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముప్పు జాబితాలోని దేశాల నుంచి భారత్‌కు నేరుగా వచ్చే విమానాలు అంతంతమాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అత్యధికులు గల్ఫ్‌ దేశాల్లోని ప్రముఖ ఎయిర్‌ లైన్స్‌లో..

Gulf మీదుగా భారత్‌కు ఒమైక్రాన్‌!

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఒమైక్రాన్‌ కేసులు క్రమేణా వెలుగులోకి వస్తుండగా.. వీరిలో ఎక్కువ శాతం గల్ఫ్‌ దేశాల మీదుగా భారత దేశానికి వస్తున్నవారే ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముప్పు జాబితాలోని దేశాల నుంచి భారత్‌కు నేరుగా వచ్చే విమానాలు అంతంతమాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అత్యధికులు గల్ఫ్‌ దేశాల్లోని ప్రముఖ ఎయిర్‌ లైన్స్‌లో ప్రయాణిస్తూ భారత్‌కు వస్తున్నారు. తక్కువ ధరల కారణంగా.. యూఏఈలోని ఎమిరేట్స్‌, ఇత్తెహాద్‌, ఖతర్‌లోని ఖతర్‌ ఎయిర్‌వేస్‌ విమానయాన సంస్ధల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, ముప్పు జాబితాలోని దేశాల నుంచి వస్తున్నవారికి భారత్‌లో విమానాశ్రయాల్లో కచ్చితంగా పరీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్య పరిస్ధితిపై కన్నేసి ఉంచుతున్నారు. ఈ జాబితాలోని లేని గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చేవారికి మాత్రం టెస్టులు కచ్చితం కాదు. ముప్పు జాబితాలో పేర్కొన్న దక్షిణాఫ్రికా, గల్ఫ్‌, యూరప్‌ దేశాల ప్రయాణికులంతా దుబాయ్‌, అబుధాబి లేదా దోహా నుంచి భారత్‌కు వస్తుంటారు. దుబాయ్‌, దోహాల నుంచి హైదరాబాద్‌కు సగటున నాలుగు నుంచి అయిదు గంటల ప్రయాణ వ్యవధి ఉంది. ఈ సమయంలో వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ క్రమంలో ముప్పు దేశాల నుంచి వచ్చేవారిని మాత్రమే పరీక్షిస్తూ, ఇతరులకు తక్కువగా పరీక్షలు చేస్తుండడం విధాన లోపాన్ని సూచిస్తోంది.

Updated Date - 2021-12-19T13:08:16+05:30 IST