ఓమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ.. తీవ్రత తక్కువ.. :హరీష్‌రావు

ABN , First Publish Date - 2022-01-18T19:03:18+05:30 IST

ఓమైక్రాన్ వ్యాప్తి ఎక్కువ.. తీవ్రత తక్కువ.. వచ్చినా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లొద్దని మంత్రి హరీష్‌రావు అన్నారు.

ఓమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ.. తీవ్రత తక్కువ.. :హరీష్‌రావు

మహబూబ్‌నగర్: ఓమైక్రాన్ వ్యాప్తి ఎక్కువ.. తీవ్రత తక్కువ.. వచ్చినా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లొద్దని మంత్రి హరీష్‌రావు  అన్నారు. మంగళవారం  బాలానగర్‌లోని 30 పడకల ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనినాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఓమైక్రాన్ వచ్చినా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లొద్దు.. మీ ఏ ఎన్ ఎం లతోనే మెడిసిన్ కిట్స్ ఉన్నాయి.. వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉంటే.. వాళ్లే ప్రభుత్వాస్పత్రికి తరలిస్తారు.. మనతో అన్ని రకాల మందులు ఉన్నాయి.అందరూ మాస్క్ లను ధరించండి.100 శాతం సెకండ్ డోస్ పూర్తి చేయాలి. 15 సంవత్సారాలు దాటిన ప్రతీ ఒక్కరికీ వాక్సిన్ చేయించండి.60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్ వేసుకోండి. వచ్చే పదిహేను ఇరవై రోజుల్లో ఇంకా కేసులు పెరుగుతాయి.. ప్రజా ప్రతినిధులు.. అధికారులూ అందరూ సేవ చేసేందుకు కృషి చేయాలి. మనకు ఈ రెండు మూడు వారాలు చాలా కీలకం. కరోనా కాలంలో జనాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. లేదంటే.. ఈ కాలంలో ఇలాంటి కార్యక్రమాలు పెట్టే వారం కాదు’’ అని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. 


‘‘ఆరోగ్య మంత్రిగా లక్ష్మారెడ్డి ఉన్నపుడు చేసిన అభివృద్ధి చాలా గొప్పది.. ప్రతిపక్షాలు పాలమూరు జిల్లాను వలస జిల్లాగా మార్చారు.సీఎం కేసీఆర్ వల్లనే పెండింగ్ ప్రాజెక్టులు పనులు పూర్తి అయ్యాయి.మన ప్రభుత్వము వచ్చాక పాలమూరులో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది. మహబూబ్‌నగర్‌లో 900 పడకల ఆస్పత్రి 200 కోట్ల ఖర్చుతో త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంఖుస్థాపన చేస్తాం.దేశంలో  బీజేపీ ప్రభుత్వం 150 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది.. మరి తెలంగాణకు ఎందుకు ఒక్క కాలేజీ ఇవ్వలేదు.. మెడికల్ పరంగా దేశంలో మన రాష్ట్రం టాప్ 3 లో ఉంది.. మరి డబుల్ ఇంజన్ గ్రౌత్ అని చెబుతున్న ఉత్తరప్రదేశ్ వైద్య పరంగా దేశంలో చివరి స్థానంలో ఉంది. బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడ. వచ్చే ఏడాది నుంచి మన ఊరు మన బడి లో భాగంగా.. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేస్తాం.. ఈరోజు కరెంట్ వినియోగంలో తెలంగాణా నంబర్ వన్‌.  తలసరి ఆదాయంలో దక్షిణ భారత దేశంలో  తెలంగాణ నంబర్ వన్. బాలానగర్‌లో ట్రౌమ కేర్ సెంటర్.. నవాబ్‌పేట‌లో ఆస్పత్రిని అభివృద్ధి చేస్తాం’’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-18T19:03:18+05:30 IST