Omicron ఎఫెక్ట్ : ప్రపంచవ్యాప్తంగా 4 వేల విమాన సర్వీసుల రద్దు

ABN , First Publish Date - 2022-01-03T13:12:25+05:30 IST

ఒమైక్రాన్ వేరియెంట్ వ్యాప్తితో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా 4 వేల విమాన సర్వీసులను రద్దు చేశారు...

Omicron ఎఫెక్ట్ : ప్రపంచవ్యాప్తంగా 4 వేల విమాన సర్వీసుల రద్దు

న్యూయార్క్: ఒమైక్రాన్ వేరియెంట్ వ్యాప్తితో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా 4 వేల విమాన సర్వీసులను రద్దు చేశారు.ఒమైక్రాన్ వ్యాప్తి భయంతో యునైటెడ్ స్టేట్స్‌లో సగానికి పైగా విమాన సర్వీసులను రద్దు నిలిపివేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు,ఒమైక్రాన్ వేరియంట్ వల్ల కలిగే కరోనావైరస్ కేసుల పెరుగుదల కారణంగా హాలిడే ట్రిప్పులు వెళ్లేందుకు ప్రయాణికులు ముందుకు రావడం లేదు. యునైటెడ్ స్టేట్స్ నుంచి పలు దేశాలకు వెళ్లే 2,400 విమానాలను నిలిపివేశారు. ఒమైక్రాన్ వేరియెంట్ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా 11,200 విమాన సర్వీసులు ఆలస్యంగా రాకపోకలు సాగించాయని ఫ్లైట్ అవేర్ అనే వెబ్‌సైట్ తెలిపింది.510 స్కైవెస్ట్ విమాన సర్వీసులు, 419 సౌత్ వెస్ట్ విమానాలు రద్దు అయ్యాయి. 


పైలెట్లు, క్యాబిన్ క్రూ సిబ్బంది క్వారంటైన్ లో ఉండటంతో విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని విమానయాన సంస్థలు తెలిపాయి.ఒమైక్రాన్ వ్యాప్తితో క్రిస్మస్, న్యూఈయర్ సెలవుల్లో విమాన ప్రయాణానికి ప్రయాణికులు ముందుకు రాలేదు.అమెరికాలో రికార్డు స్థాయిలో ఒమైక్రాన్ కేసులు వెలుగుచూడటంతో పలు రవాణ సంస్థలు తమ సేవలను నిలిపివేశాయి.యూఎస్ లో 3,46,869 కరోనా కేసులు నమోదయ్యాయి. 


Updated Date - 2022-01-03T13:12:25+05:30 IST