మా టీకా‌తో ఒమైక్రాన్‌కు చెక్: రష్యా

ABN , First Publish Date - 2021-11-30T04:07:20+05:30 IST

స్పుత్నిక్-వీ టీకాకు కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్‌కు చెక్ పెట్టే సామర్థ్యం ఉందని రష్యా ప్రభుత్వం తాజాగా పేర్కొంది. ఈ వేరియంట్‌ను అడ్డుకునేందుకు తాము బూస్టర్ డోసులు ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా పేర్కొంది.

మా టీకా‌తో ఒమైక్రాన్‌కు చెక్: రష్యా

స్పుత్నిక్-వీ టీకాకు కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్‌కు చెక్ పెట్టే సామర్థ్యం ఉందని రష్యా ప్రభుత్వం తాజాగా పేర్కొంది. ఈ వేరియంట్‌ను అడ్డుకునేందుకు తాము బూస్టర్ డోసులు ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా పేర్కొంది. కొత్త వేరియంట్‌పై భయాందోళనలు కేవలం భావోద్వేగపరమైన అంశమేనని, ఈ వైరస్‌ ప్రమాదకరమైనదని చెప్పేందుకు ఇప్పటివరకూ శాస్త్ర పరమైన ఆధారాలేవీ లేవని పేర్కొంది. కొత్త వేరియంట్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు.. ఒమైక్రాన్ కారణంగా ఇన్ఫెక్షన్ల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా పేర్కొంది. ఇది కొన్ని ప్రాంతాల్లో దారుణ పరిస్థితులకు కూడా దారితీయోచ్చని కూడా హెచ్చరించింది. 

Updated Date - 2021-11-30T04:07:20+05:30 IST