Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒమైక్రాన దడ..!

కరోనా థర్డ్‌వేవ్‌తో టెన్షన

విదేశాల నుంచి అనంతకు 163 మంది రాక

కొత్త వైర్‌సతో వారందరికీ హోం క్వారంటైన

కొవిడ్‌ పరీక్షల్లో కొందరికి పాజిటివ్‌

వైరస్‌ లక్షణాల నిర్ధారణకు హైదరాబాద్‌ ల్యాబ్‌కు.. 

జిల్లా ఆస్పత్రిలో ఏర్పాట్లపై కసరత్తు

అనంతపురం వైద్యం, నవంబరు 30: జిల్లాలో కరోనా థర్డ్‌ వేవ్‌ మళ్లీ కలకలం రేపుతోంది. ఒమైక్రాన వైరస్‌ దడ పుట్టిస్తోంది. జిల్లాలో 2020లో కూడా ఇలాగే కరోనా ఆరంభంలో తొలుత విదేశాల్లోనే వైరస్‌ ప్రభావం చూపుతూ వచ్చింది. ఆ తర్వాత దేశంలోని వివిధ రాషా్ట్రల్లో కేసులు వెలుగుచూస్తూ వచ్చాయి. అనంతరం నగరం, పట్టణం, పల్లె అనే తేడా లేకుండా కరోనా రెండు విడతలు విజృంభిస్తూ.. వేలాది మంది వైర్‌సకు చిక్కి విలవిల్లాడిపోయారు. అనంతపురం జిల్లాలోనూ 2020 మార్చిలో రెండు కేసులతో మొదలై ఇప్పుడు 158034 కేసుల వరకు నమోదయ్యాయి. ఇందులో 1093 మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నా, అంతకు మూడింతల మంది ప్రాణాలు కోల్పోయి, ఆయా కుటుంబాలు చితికిపోయాయి. ఈనేపథ్యంలోనే కరోనా భయం ఇప్పటికీ వెంటాడుతోంది. ఇటీవల కొన్ని నెలలుగా కరోనా తీవ్రత తగ్గుతూ వచ్చింది. జిల్లాలోనూ కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా తగ్గిపోయాయి. దీంతో జనం కొంత అశ్రద్ధతో కొవిడ్‌ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారం తిరుగుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికార యంత్రా ంగం సైతం  చూస్తుండిపోయింది. తాజాగా మళ్లీ ఒమైక్రాన కరోనా కొత్త లక్షణాలు కలిగిన వైరస్‌ వేగంగా విస్తురిస్తున్నట్లు డబ్ల్యుహెచఓ హెచ్చరిక జారీ చేసింది. చివరకు ప్రధాని మోదీ సైతం అప్రమత్తమై అన్ని రాషా్ట్రలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే విదేశాల్లో ఈ కొత్త వైరస్‌ బారిన అనేక మంది పడుతుండడంతో పలు దేశాల్లో కరోనా ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో జిల్లాలోనూ ఒమైక్రాన కొత్త వైరస్‌ టెన్షన మొదలైంది. జిల్లా నుంచి కూడా అనేకమంది వివిధ దేశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఇతర రాషా్ట్రలకైతే నిత్యం వందలాది మంది వెళ్లివస్తున్నారు. గతంలోనూ ఇతర దేశాల నుంచి వచ్చినవారు అనేక మంది కరోనా బారిన పడ్డారు. వారి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందింది. దీంతో ఇప్పుడు మళ్లీ విదేశాలు, వివిధ రాషా్ట్రల నుంచి రాకపోకలు సాగిస్తున్న వారిపై దృష్టి పెట్టారు. ఇప్పటికే బెంగుళూరులో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి ఒమైక్రాన కరోనా లక్షణాలు బయటపడినట్లు చెబుతున్నారు. బెంగుళూరు.. అనంత జిల్లాకు సమీపంలో ఉంది. దీంతో జిల్లా యంత్రాంగం విదేశాల నుంచి విమానాల్లో ప్రయాణం చేసి వస్తున్న వారిపై దృష్టి సారించింది. బెంగుళూరు, హైదరాబాద్‌ విమానాశ్రయాల్లో దిగుతున్న వారిలో జిల్లాకు వస్తున్న వారి వివరాలను తెలుసుకుంటున్నారు.


విదేశాల నుంచి 163 మంది రాక..

గత కొన్ని రోజుల్లోనే జిల్లాకు 163 మంది ఇతర దేశాల్లో ఉంటున్న వారు వచ్చినట్లు వైద్యశాఖ గుర్తించింది. ఇందులో అత్యధిక మంది అనంతపురం నగర వాసులు కాగా.. బత్తలపల్లి, చెన్నేకొత్తపల్లి, గోరంట్ల, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కనగానపల్లి, కణేకల్లు, నంబులపూలకుంట, ఓబుళదేవరచెరువు, పామిడి, పెద్దవడుగూరు, పెనుకొండ, పుట్లూరు, పుట్టపర్తి, తాడిమర్రి, తాడిపత్రి, తలుపుల, ఉరవకొండ, వజ్రకరూరు, యాడికి మండలాలకు చెందిన వారు ఉన్నారు. వీరందరినీ గుర్తించి హోం క్వారంటైనలో ఉంచి ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నట్లు డీఎంహెచఓ డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌ తెలిపారు. వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామనీ, వీరిలో కొందరికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. ఒమైక్రాన వైరస్‌ లక్షణాలు తెలుసుకోవడానికి హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపినట్లు జిల్లా వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. పాజిటివ్‌లపై అధికారులు గుట్టుగానే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.


జిల్లా ఆస్పత్రిలో అప్రమత్తత

కరోనా మూడో విడత నేపథ్యంలో జి ల్లా సర్వజనాస్పత్రిలో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథం వివిధ విభాగాల వైద్యాధికారులు, సి బ్బందితో అత్యవసర సమావేశం ఏ ర్పాటు చేసి, చర్చించారు. ఆక్సిజన ప్లాంట్లు, పైప్‌లైన్లు, ఆక్సిజన కాన్సనే్ట్రటర్ల పనితీరును అడిగి తెలుసుకున్నా రు. అన్నింటినీ పరిశీలించి, వెంటనే అవసరమైన మరమ్మతులు చేసి అం దుబాటులోకి వచ్చేలా చూడాలని టె క్నీషియన్లను ఆదేశించారు. కొవిడ్‌ చి కిత్సకు ప్రత్యేక వైద్యులు ఉండేవారు. ప్రస్తుతం వారిని తొలగించారు. మళ్లీ ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటుకు హెచఓడీలు సూచించగా.. అందుకు తగిన చర్యలు చేపట్టారు. పడకలు ఏ యే విభాగాల్లో ఎన్ని ఏర్పాటు చే యాలో చర్చించారు. జిల్లా ఆస్పత్రి, సూపర్‌ స్పెషాలిటీ, కేన్సర్‌ యూనిట్లలో తగిన ఏర్పాట్లు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

Advertisement
Advertisement