ఒమైక్రాన నివారణ చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-12-08T05:46:04+05:30 IST

కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రానను అరికట్టేందుకు అన్నిరకాల ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి శంకర్‌నారాయణ.. అధికారులను ఆదేశించారు. మంగళవా రం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స హాల్‌లో కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజనతో కలిసి ఒమైక్రానపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఒమైక్రాన నివారణ చర్యలు చేపట్టాలి

విదేశాల నుంచి జిల్లాకు వచ్చేవారిపై దృష్టి పెట్టండి..

మంత్రి శంకర్‌నారాయణ

అనంతపురం, డిసెంబరు7(ఆంధ్రజ్యోతి): కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రానను అరికట్టేందుకు అన్నిరకాల ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి శంకర్‌నారాయణ.. అధికారులను ఆదేశించారు. మంగళవా రం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స హాల్‌లో కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజనతో కలిసి ఒమైక్రానపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. మం త్రి మాట్లాడుతూ.. ఒమైక్రాన కేసులు పెరగకుండా ఆదిలోనే అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ దిశగా అధికారులు అప్రమత్తం గా ఉండాలన్నారు. కర్ణాటక సరిహద్దు జిల్లా కావడంతో ఆ రాష్ట్రం నుంచి పాజిటివ్‌ నిర్ధారణ అయినవారు, వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యం లో చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. కొవిడ్‌ టెస్టింగ్‌లు మరింత పెంచాలన్నారు. వైరల్‌ ఫీ వర్లు వ్యాపించకుండా ఫీవర్‌ సర్వే చేపట్టాలన్నా రు. క్షేత్రస్థాయిలో ఏఎనఎంలు, వలంటీర్లను ఉపయోగించుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో శానిటేషన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విదేశాల నుంచి బెంగళూరు వచ్చి అక్కడి నుంచి జి ల్లాకు వచ్చేవారి వివరాల ట్రేసింగ్‌ అనేది చాలా ముఖ్యమన్నారు. వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాజిటివ్‌ వస్తే ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లు ట్రేసింగ్‌ చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన ప్లాంట్లు, పైపులైన్లలో లోటుపాట్లు ఉంటే పరిశీలించాలన్నారు. ఆక్సిజన ట్యాంకుల శుద్ధీకరణకు యాక్షన ప్లాన తయారు చేయాలన్నారు. కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన మాట్లాడుతూ... ఒమైక్రానను అరికట్టేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉండాలన్నారు. ఆ దిశగా కొవిడ్‌ యాక్టివిటీలను చేపట్టాలన్నారు. నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించేలా చూడాలన్నారు. మాస్కు వేసుకోని వారిపై జరిమానాలు విధించాలన్నారు. విదేశాల నుంచి జిల్లాకు వస్తు న్న వారిని నిత్యం ట్రాక్‌ చేయాలన్నారు. వా రి నుంచి శాంపిళ్లు సేకరించి, టెస్టింగ్‌ చేయాలని మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలకు సూచించారు. సమావేశంలో జేసీలు నిశాంతకుమార్‌, సి రి, గంగాధర్‌ గౌడ్‌, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ నవీన, ఏఎస్పీ ఓఎస్డీ రామకృష్ణప్రసాద్‌, జిల్లా వైద్యాధికారి కామేశ్వరప్రసాద్‌, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ జగన్నాథ్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి, జడ్పీ సీఈఓ భాస్కర్‌ రెడ్డి, డీటీసీ శివరాంప్రసాద్‌, డీసీహెచఎ్‌స రమే్‌షనాథ్‌, టూ రిజం జిల్లా మేనేజర్‌ దీపక్‌, ఏపీఎంఎ్‌సఐడీసీ ఈఈ, ఆర్డీఓలు నిశాంతరెడ్డి, మధుసూదన, వెం కటరెడ్డి, వరప్రసాద్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రవీంద్ర పాల్గొన్నారు.


Updated Date - 2021-12-08T05:46:04+05:30 IST