Abn logo
Aug 2 2021 @ 02:18AM

మొహర్రం ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : మొహర్రం ఏర్పాట్లపై హోంమంత్రి మహమూద్‌ అలీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదివారం సమీక్ష నిర్వహించారు. కరోనా విపత్కర పరిస్థితుల వల్ల గత సంవత్సరం మొహర్రంపై ఆంక్షలు విధించాల్సి వచ్చిందన్నారు. ఈసారి ఎలాంటి ఆంక్షలు విధించకుండా ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని నిర్వాహకులకు మంత్రులు భరోసా ఇచ్చారు. మొహర్రం సందర్భంగా పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖ ఇతర విభాగాలు చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎ.కె.ఖాన్‌ వివరించారు. మొహర్రం ఏర్పాట్ల బడ్జెట్‌ను రూ.50 లక్షలకు పెంచాలన్న నిర్వాహకుల అభ్యర్థనకు వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మహమద్‌ సలీం అంగీకారం తెలిపారు.