Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లిచూపుల్లో అబ్బాయి మాటతీరు నచ్చి ఇష్టపడిందా యువతి.. పెళ్లయిన రెండో రోజే ఆ భర్త గురించి అసలు నిజాలు తెలిసి..

ఆమె ఎమ్ఏ చదువుకుంది.. పెళ్లి చూపుల్లో ఓ అబ్బాయిని చూసి ఇష్టపడింది.. అతడి మాటలు విని తన భవిష్యత్తు ఎంతో బాగుంటుందని ఆశలు పెట్టుకుంది.. ఎంతో సంతోషంతో పెళ్లికి ఓకే చెప్పింది.. అయితే ఆమె సంతోషం ఎంతో సేపు నిలవలేదు.. పెళ్లైన రెండో రోజే ఆ వ్యక్తి తన నిజ స్వరూపం బయటపెట్టాడు.. రూ.10 లక్షలు కట్నం తెమ్మని అడిగాడు.. అడిగనంత కట్నం తీసుకు రాలేదని శారీరకంగా చిత్ర హింసలు పెట్టాడు.. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. 


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ప్రమీత్ అనే యువకుడు ఆరు నెలల క్రితం 23 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి చూపుల్లో ఎన్నో ఆదర్శాలు వల్లించిన ప్రమీత్ వివాహం తర్వాత తన నిజం స్వరూపం బయటపెట్టాడు. టీవీ, కారు, ఎనిమిది లక్షల రూపాయల కట్నం తీసుకురమ్మని అడిగాడు. షాకైన యువతి అందుకు నిరాకరించింది. దీంతో ప్రమీత్, అతని కుటుంబ సభ్యులు ఆ యువతిని వేధించడం మొదలుపెట్టారు. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేశారు. అయినా ఆ యువతి అన్నింటినీ భరించింది. 


ఈ నెల 10న తన భార్యను ప్రమీత్ పుట్టింట్లో దించేసి వెళ్లిపోయాడు. దీంతో ఆ యువతి తన తల్లిదండ్రులకు తన కష్టాలు చెప్పుకుంది. తన తండ్రి, సోదరుడితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్త కుటుంబంపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమీత్ కుటుంబ సభ్యులను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement