నేపాల్‌ ప్రధానిగా మళ్లీ కేపీ శర్మ ఓలి

ABN , First Publish Date - 2021-05-14T08:01:13+05:30 IST

నేపాల్‌ రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. గత సోమవారం విశ్వాస పరీక్షలో ఓడిపోయిన కేపీ శర్మ ఓలి గురువారం మళ్లీ ప్రధానిగా నియమితులయ్యారు. అంతకుముందు....

నేపాల్‌ ప్రధానిగా మళ్లీ కేపీ శర్మ ఓలి

ఖట్మాండు, మే 13: నేపాల్‌ రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. గత సోమవారం విశ్వాస పరీక్షలో ఓడిపోయిన కేపీ శర్మ ఓలి గురువారం మళ్లీ ప్రధానిగా నియమితులయ్యారు. అంతకుముందు ప్రత్యామ్నాయ ప్రభు త్వం ఏర్పాటుచేయడానికి వీలుగా ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్‌, ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (మావోయిస్ట్‌ సెంటర్‌) గురువారం సాయంత్రంలోగా మెజార్టీ సభ్యుల మద్దతుతో రావాలని అధ్యక్షురాలు విద్యాదేవి భండారి ఆదేశించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సం ఖ్యలో సభ్యుల మద్దతును కూడగట్టడంలో ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యా యి.  దీంతో అతిపెద్ద పార్టీ నేతగా శర్మ ఓలిని ప్రధానిగా నియమిస్తున్నట్టు అధ్యక్షురాలు ప్రకటన విడుదల చేశారు. 

Updated Date - 2021-05-14T08:01:13+05:30 IST