రాత్రి 11.30 గంటలు.. రైల్వే స్టేషన్‌లో మెట్ల కింద నుంచి ఏడుపులు.. ఏంటా అని అనుమానంతో పోలీసులు వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2021-10-20T02:47:02+05:30 IST

రాత్రి 11.30 గంటల సమయంలో వచ్చి, పోయే ప్రయాణికులతో రైల్వే స్టేషన్ రద్దీగా ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రైల్వే పోలీసులు పహారా కాస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పాప ఏడుపు శబ్దం రావడంతో అ

రాత్రి 11.30 గంటలు.. రైల్వే స్టేషన్‌లో మెట్ల కింద నుంచి ఏడుపులు.. ఏంటా అని అనుమానంతో పోలీసులు వెళ్లి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: రాత్రి 11.30 గంటల సమయంలో వచ్చి, పోయే ప్రయాణికులతో రైల్వే స్టేషన్ రద్దీగా ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రైల్వే పోలీసులు పహారా కాస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పాప ఏడుపు శబ్దం రావడంతో అక్కడున్న వారంతా ఉలిక్కిపడ్డారు. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అని వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులు.. రైల్వే స్టేషన్‌లోని మెట్ల దగ్గర చిన్నారిని చూసి షాక్ అయ్యారు. అనంతరం ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..



హర్యానాలోని రేవారి జంక్షన్‌ సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఈ క్రమంలోనే ఓ పాప ఏడుపు శబ్దం విని స్థానికులు మొదటగా లైట్ తీసుకున్నారు. అయితే ఆ పాప ఎంతకూ ఏడుపు ఆపకపోవడంతో రంగంలోకి రైల్వే పోలీసులు దిగారు. పాప అంతలా ఏడుస్తుంటే ఆమె తల్లి ఏం చేస్తుంది అనుకుంటూ ఆ చిన్నారిని వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారికి ఓ షాకింగ్ సీన్ కనిపించింది. రైల్వే స్టేషన్ మెట్ల దగ్గర సుమారు ఏడాదిన్నర వయసున్న పాప.. ఒంటిరిగా కూర్చుని ఏడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆ చిన్నారిని అక్కడ ఎవరో కావాలనే వదిలి వెళ్లినట్లు గ్రహించారు. ఆ తర్వాత పాప ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆ చిన్నారిని ఆసుపత్రి తరలించారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో రికార్డైన దృశ్యాల ఆధారంగా పాప కుటుంబ సభ్యులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.




Updated Date - 2021-10-20T02:47:02+05:30 IST