వృద్ఢుడి ఖాతా నుంచి 1.57 లక్షలు కాజేసిన కేర్‌టేకర్‌

ABN , First Publish Date - 2021-06-12T16:59:50+05:30 IST

వృద్ధాశ్రమంలో చేరిన వృద్ధుడి ఏటీఎం కార్డు ద్వారా...

వృద్ఢుడి ఖాతా నుంచి 1.57 లక్షలు కాజేసిన కేర్‌టేకర్‌

హైదరాబాద్‌ సిటీ : వృద్ధాశ్రమంలో చేరిన వృద్ధుడి ఏటీఎం కార్డు ద్వారా రూ. 1.57 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాడి ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. నాగోల్‌లోని ఓ వృద్ధాశ్రమంలో వినయ్‌రెడ్డి అనే కేర్‌టేకర్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో పనిలో చేరాడు. అతడిని ఓ వృద్ధుడికి కేర్‌టేకర్‌గా నియమించారు. వృద్ధుడి ఏటీఎం పిన్‌ నంబర్‌ తెలుసుకున్న వినయ్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌, జల్సాలకు వృద్ధుడి ఖాతాలోని రూ. 1.57 లక్షలు కాజేశాడు. విషయం తెలుసుకున్న వృద్ధుడు ఆశ్రమం నిర్వాహకుల సహకారంతో సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు వినయ్‌రెడ్డిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-12T16:59:50+05:30 IST