ప్రతీ 100 సెకండ్లకు ఒక పిల్లవాడికి హెచ్ఐవీ

ABN , First Publish Date - 2020-11-26T13:36:39+05:30 IST

ప్రతీ 100 సెకండ్లకు 20 ఏళ్ల లోపు పిల్లవాడు లేదా యువకుడు హెచ్ఐవీ బారిన పడ్డారని యునిసెఫ్ తన తాజా నివేదికలో....

ప్రతీ 100 సెకండ్లకు ఒక పిల్లవాడికి హెచ్ఐవీ

యునిసెఫ్ తాజా నివేదికలో వెల్లడి

న్యూయార్కు : ప్రతీ 100 సెకండ్లకు 20 ఏళ్ల లోపు పిల్లవాడు లేదా యువకుడు హెచ్ఐవీ బారిన పడ్డారని యునిసెఫ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. గత ఏడాది 2.8 మిలియన్ల మంది పిల్లలు హెచ్ఐవీ బారిన పడ్డారని యునిసెఫ్ విడుదల చేసిన తన నివేదికలో వివరించింది. పిల్లలు, యువత, గర్భిణీ స్త్రీలు హెచ్ఐవీ వ్యతిరేక పోరాటంలో వెనుకబడి ఉన్నారని యునిసెఫ్ నివేదికలో హెచ్చరించింది. గత సంవత్సరం దాదాపు 1,10,000 మంది పిల్లలు హెచ్ఐవీతో మరణించారని నివేదికలో యునిసెఫ్ తెలిపింది. 


యువకులతో పోలిస్తే పిల్లలు ఎయిడ్సు వల్ల ఎక్కువ మంది మరణించారని తేలింది. తమ బిడ్డలకు హెచ్ఐవీ వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి తల్లులకు యాంటీ రెట్రోవైరల్ థెరపీ పెంచాలని నిర్ణయించారు. హెచ్ఐవీతో బాధపడుతున్న  1.3 మిలియన్ల మంది గర్భిణులకు పుట్టిన పిల్లలకు, తల్లి పాలు ఇవ్వడంతో హెచ్ఐవీ సోకిందని అంచనా వేశారు. ఆరోగ్య సేవలు మెరుగుపర్చడం ద్వారా హెచ్ఐవీని అదుపు చేయాలని యునిసెఫ్ అన్ని ప్రభుత్వాలకు సూచించింది. 


హెచ్ఐవీ, ఎయిడ్సు కు వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాడుతున్న పిల్లల్లో యాంటీ రెట్రోవైరల్ చికిత్స కవరేజ్ తక్కువగా ఉందని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు  హెచ్ఐవీ మహమ్మారి బారిని పడుతున్నారని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోర్ చెప్పారు. గత సంవత్సరం 0 నుంచి 9 సంవత్సరాల వయసు గల 1,50,000 మంది పిల్లలు కొత్తగా హెచ్ఐవీ బారిన పడ్డారు. 10 నుంచి 19 సంవత్సరాల వయసుగల 1,70,000 మందికి కౌమార దశలో హెచ్ఐవీ సోకింది. 

Updated Date - 2020-11-26T13:36:39+05:30 IST