Abn logo
Sep 24 2021 @ 07:06AM

రూ.కోటి నకిలీ నోట్లు స్వాధీనం

               - 10 మంది అరెస్టు 


పెరంబూర్‌(చెన్నై): మదురైలో వాహనతనిఖీలు చేపట్టిన పోలీసులు రెండు కార్లలో తరలిస్తున్న రూ.కోటి నకిలీ నోట్లు స్వాధీనం చేసు కున్నారు. జిల్లాలో అజ్ఞాతంలో ఉన్న, తప్పించుకు తిరుగుతున్న నేరస్తులను అరెస్టు చేయడం కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందం బుధవారం రాత్రి కల్లికుడి ప్రాంతంలో వాహన తనిఖీలు చేపట్టింది. ఆ సమయంలో అటుగా వచ్చిన రెండు కార్లను ఆపి సీట్ల కింద దాచిన నాలుగు బ్యాగులు పరిశీలించగా, కట్టలు కట్టల నగదు బయటపడింది. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు అవి నకిలీ నోట్లుగా గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు గతంలో పాత కేసుల్లో నిందితులుగా పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో రూ. కోటి నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, కరూర్‌ జిల్లాకు చెందిన యోగరాజ్‌, చెన్నైకి చెందిన సునీల్‌ కుమార్‌, మదురైకి చెందినఅన్బరసన్‌, కోవైకు చెందిన టోని థామస్‌, అక్బర్‌, దిండుగల్‌ జిల్లాకు చెందిన హుమయూన్‌, దండీశ్వరన్‌, ఈరోడ్‌ జిల్లాకు చెందిన శరవణన్‌, నామక్కల్‌ జిల్లాకు చెందిన రమేష్‌, వేలూరు కాట్పాడికి చెందిన పొన్‌రాజ్‌లను అరెస్టు చేసి, రెండు కార్లు స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు.

క్రైమ్ మరిన్ని...