Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యుత్‌ తీగలు తగిలి ఒకరి మృతి

- ఇద్దరికి గాయాలు

వాంకిడి, డిసెంబరు 2: వన్యప్రాణుల వేటకోసం అమర్చిన విద్యుత్‌ తీగ లకు తగిలి ఒకరు మృతిచెందగా మరోఇద్దరికి గాయాలైన సంఘటన మండ లంలోని డొండ్రా గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై డీకొండ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం టోకిగూడ గ్రామానికి చెందిన పనాట దేవరావు, అతని అక్కలు మూతినేని భీమక్క, భూలేలు నీలాబాయి, మూతినేని రాజక్క, మరోవ్యక్తి భీమయ్య కలిసి డోండ్రా గ్రామ సమీపంలోని వాగులో చేపలు పట్టుకునేందుకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో డొండ్రా గ్రామ సమీపంలో వన్యప్రాణుల వేటకోసం గుర్తుతెలియని వ్యక్తులు అమర్చిన విద్యుత్‌ తీగలకు తగిలి భూలేలు నీలాబాయి(40) అక్కడికక్కడే మృతిచెందింది. మూతినేని భీమక్కకు ఎడమచేయి, కాలిపై గాయాల య్యాయి. రాజక్కకళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెపరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని సరోజని వైద్యశాలకు తరలించారు. విద్యుత్‌ తీగలు అమర్చిన వారిపై కేసునమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై డీకొండ రమేష్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement