Abn logo
Sep 4 2021 @ 11:36AM

Maharashtra:బోయిసర్‌ ఫ్యాక్టరీలో పేలుడు..ఒకరి మృతి

నలుగురికి గాయాలు

బోయిసర్ (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని బోయిసర్ నగరం పారిశ్రామిక వాడలోని వస్త్ర పరిశ్రమలో శనివారం సంభవించిన పేలుడులో ఒకరు మరణించారు. బోయిసర్ లోని జఖారియా ఫ్యాబ్రిక్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఒకరు మరణించగా, మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.ఫ్యాక్టరీలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించామని పాల్ఘార్ పోలీసులు చెప్పారు. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు.అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు.ఫ్యాక్టరీలో పేలుడుకు కారణాలు తెలియలేదు.