వైద్యుల నిర్లక్ష్యంతో ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-04-18T06:00:43+05:30 IST

వైద్యుడి నిర్లక్ష్యంతో ఒకరు మృతిచెందిన సంఘటన జిల్లాకేంద్రంలోని శ్రీనివాస గ్యాస్ట్రో ఆస్పత్రిలో శనివారం చోటుచేసు కుంది. ఈ విషయంపై మృతుడి బంధువు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్ట డం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మెట్లచిట్టాపూర్‌కు చెందిన దేవుళ్ల శ్రీనివాస్‌ గ్యాస్ట్రో స మస్యతో నిజామాబాద్‌లోని శ్రీనివాస గ్యాస్ట్రో ఆసుపత్రిలో చేరాడు.

వైద్యుల నిర్లక్ష్యంతో ఒకరి మృతి

ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన

శ్రీనివాస్‌ గ్యాస్ట్రో వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

పెద్దబజార్‌, ఏప్రిల్‌ 17: వైద్యుడి నిర్లక్ష్యంతో ఒకరు మృతిచెందిన సంఘటన జిల్లాకేంద్రంలోని శ్రీనివాస గ్యాస్ట్రో ఆస్పత్రిలో శనివారం చోటుచేసు కుంది. ఈ విషయంపై మృతుడి బంధువు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్ట డం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మెట్లచిట్టాపూర్‌కు చెందిన దేవుళ్ల శ్రీనివాస్‌ గ్యాస్ట్రో స మస్యతో నిజామాబాద్‌లోని శ్రీనివాస గ్యాస్ట్రో ఆసుపత్రిలో చేరాడు. అయితే, వైద్యుడు అభిషేక్‌ రెండు గంటల పాటు చికిత్స ప్రారంభించలేదు. దీంతో పరిస్థితి విషమించి శ్రీనివాస్‌ మృతిచెందాడు. వైద్యుడు అభిషేక్‌ తీవ్ర నిర్ల క్ష్యంతోనే శ్రీనివాస్‌కు వైద్యం అందక మృతిచెందినట్లు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుడితో వాగ్వాదానికి దిగారు. తక్షణమే డాక్టర్‌పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేసే వరకూ మృతదేహాన్ని తీసుకెళ్లబోమని ఆస్పత్రి ఎదుట భీష్మించుకొని కూర్చున్నారు. ఈ విషయం తెలుసుకున్న వ న్‌టౌన్‌ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు, ఎస్‌ఐ నర్సింలు సిబ్బందితో అక్కడికి చేరుకొని మృతుడి బంధువులతో మాట్లాడారు. విచారించి డాక్టర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మృతుడి బంధువులు ఆందోళ న విరమించారు. కాగా, ఈ విషయంపై వైద్యుడు అభిషేక్‌ మాట్లాడుతూ.. చికిత్స అందిస్తున్న సమయానికి ఫీట్స్‌తో కూడిన గుండెపోటు రావడంతో శ్రీనివాస్‌ మృతిచెందినట్లు తెలిపారు. 

Updated Date - 2021-04-18T06:00:43+05:30 IST