Abn logo
Oct 22 2021 @ 00:00AM

చాపాడు చానల్‌లో పడి ఒకరి మృతి

మృతిచెందిన ప్రభుదాస్‌

చాపాడు, అక్టోబరు 22: మండలంలోని చెంచుపల్లె గ్రామం వద్ద ఉన్న చాపాడు చానల్‌లో పడి అదే గ్రామానికి చెందిన పాలగిరి ప్రభుదాస్‌ (45) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు... ప్రభుదాసు మద్యానికి బానసై మద్యం సేవించి ఈనెల 21న గురువారం సాయంత్రం కాలుజారి కాలువలో పడి గల్లంతయ్యాడు. శుక్రవారం అయ్యవారిపల్లె గ్రామం వద్ద ఉప కాలువలో అతని మృతదేహా న్ని గుర్తించారు. ప్రభుదాసు భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.