ఈ ఇంటి కథ వింటే కన్నీళ్లకే కన్నీళ్లొస్తాయ్..!

ABN , First Publish Date - 2021-06-15T06:47:56+05:30 IST

తాడిపత్రి పట్టణంలోని బిందెలకాలనీలో సోమవారం రమణమ్మ, ఆమె కూతురు అపర్ణ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

ఈ ఇంటి కథ వింటే కన్నీళ్లకే కన్నీళ్లొస్తాయ్..!
మృతిచెందిన తల్లీకూతురు


- నాలుగేళ్ల క్రితం కుమారుడు మృతి

- గతేడాది కరోనాకు ఇంటి పెద్దదిక్కు బలి

-  తాజాగా తల్లీ బిడ్డ ఆత్మహత్య 

- కుమార్తె సచివాలయ ఉద్యోగి

- తాడిపత్రిలో కలకలం

ఇది ఓ ఇంటి విషాదాంతం. ఆ ఇంటి కథ వింటే కన్నీళ్లకే కన్నీళ్లు వస్తాయి. భార్యాభర్తలు, వారికి కుమారుడు, కుమార్తె. నలుగురూ హాయిగా ఉండేవారు. నాలుగేళ్ల క్రితం కుమారుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దానిని జీర్ణించుకోలేని కుటుంబం ఉన్న గ్రామం విడిచి, మరో ఊరు చేరింది. అక్కడ కూడా వారిని విధి వెంటాడింది. ఇంటి పెద్ద దిక్కును గతేడాది కరోనా బలి తీసుకుంది. ఇక తల్లీబిడ్డ మాత్రమే మిగిలారు. పెద్ద దిక్కు మరణాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఏడాదిగా మానసిక క్షోభ అనుభవించారు. చనిపోదామని రైలు కింద పడేందుకెళ్లారు. పోలీసులు కాపాడారు. అయినా.. వారు మానసిక క్షోభ నుంచి బయటపడలేకపోయారు. తాజాగా తల్లీబిడ్డలు ఇంట్లోనే విషపు గుళికలు మింగి , ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో కుటుంబం కుటుంబమే లేకుండా పోయింది.

తాడిపత్రి, జూన14: 

తాడిపత్రి పట్టణంలోని బిందెలకాలనీలో సోమవారం రమణమ్మ, ఆమె కూతురు అపర్ణ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పుట్లూరు మండలం పి. చింతలపల్లికి చెందిన రామకృష్ణారెడ్డి కుమారుడు అశోక్‌రెడ్డి నాలుగేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కొడుకు మృతిని తట్టుకోలేని రామకృష్ణారెడ్డి, భార్య రమణమ్మ, కూతురు అపర్ణతో కలిసి ఏడాదిన్నర క్రితం తాడిపత్రి పట్టణంలోని బిందెలకాలనీకి వచ్చి, నివాసముండే వారు. ఏడాది క్రితం కరోనాతో రా మకృష్ణారెడ్డి మృతిచెందాడు. అప్పటికే కొ డుకు మృతితో తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న రమణమ్మను భర్త మరణం మరింత కలచి వేసింది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని రమణమ్మ కూతురితో క లిసి రైలుకిందపడి ఆత్మహత్యకు యత్నించింది. సకా

లంలో పోలీసులు స్పందించి, వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో కూతురు అపర్ణకు పు ట్లూరు మం డలం శనగలగూడూరు సచివాలయంలో సర్వేయర్‌గా ఉద్యోగం వచ్చింది. రుణదాత ల ఒత్తిళ్లు అధికం కావడంతో వాటిని తీర్చేందుకు చింతలపల్లిలో ఉ న్న 9 ఎకరాల పొలంలో మూడెకరాలు విక్రయించారు. మిగిలిన పొ లాన్ని గుత్తకు ఇచ్చారు. భర్త, కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని వారు తరచూ మానసిక క్షోభతో అనారోగ్యానికి లోనయ్యేవారు. వారులేని తాము జీవించడం వృథాగా భావించి, ఇంట్లో విషపుగుళికలను మింగి, ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు పోలీసులు, బంధువులకు సమాచారం అందించారు. రమణమ్మ బంధువు ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి, మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.




Updated Date - 2021-06-15T06:47:56+05:30 IST