బీహార్‌లో 108 గిరిజన గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ

ABN , First Publish Date - 2020-10-24T17:21:51+05:30 IST

గిరిజనులపై పోలీసుల దాడికి నిరసనగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని 108 గిరిజన గ్రామాల నివాసితులు ప్రకటించారు....

బీహార్‌లో 108 గిరిజన గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ

పట్నా (బీహార్): గిరిజనులపై పోలీసుల దాడికి నిరసనగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని 108 గిరిజన గ్రామాల నివాసితులు ప్రకటించారు. బీహార్ రాష్ట్రంలోని కైమూర్ ప్రాంతంలో పోలీసులు తప్పుడు కేసులు పెట్టి 25 మంది కైమూర్ ముక్తి మోర్చా కార్యకర్తలను అరెస్టు చేశారు. అటవీశాఖ  బలవంతంగా పోలీసులను ఉపయోగించి దాడులు చేయిస్తున్న నేపథ్యంలో గిరిజన గ్రామాల ప్రజలు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. పోలీసుల వైఖరికి నిరసనగానే కైమూర్ ప్రాంతంలోని 108 గిరిజన గ్రామాల ప్రజలు పోలింగును బహిష్కరిస్తారని కైమూర్ ముక్తిమోర్చా వివరించింది.

Updated Date - 2020-10-24T17:21:51+05:30 IST