వంద శాతం వ్యాక్సినేషన్‌కు కృషి

ABN , First Publish Date - 2021-12-08T06:29:31+05:30 IST

థర్డ్‌వేవ్‌ దృష్ట్యా వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం ఆహార్నిశలు కృషి చేస్తుందని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు వార్డులలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకోవాలని ఇంటింటికి వెళ్లి సూచించారు. కాగా కరోనాతో పాటు కొత్త వైరస్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ రాకుండా జాగ్రత్తలు

వంద శాతం వ్యాక్సినేషన్‌కు కృషి
జామిడిలో 102 ఏళ్ల సూర్యవంశీ గౌబాయికి టీకా వేస్తున్న సిబ్బంది

జిల్లా కేంద్రంలో టీకా పంపిణీ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 7: థర్డ్‌వేవ్‌ దృష్ట్యా వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం ఆహార్నిశలు కృషి చేస్తుందని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు వార్డులలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకోవాలని ఇంటింటికి వెళ్లి సూచించారు. కాగా కరోనాతో పాటు కొత్త వైరస్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తప్పని సరిగా మాస్కులు ధరించాలన్నారు. 

మహిళలు చైతన్యవంతులు కావాలి

మారుతున్న సమాజంలో మహిళలు, యువతుల పై జరుగుతున్న అఘాయిత్యాలు, ఆత్యాచారాలు, దాడుల దృష్ట్యా మహిళలు చైతన్యవంతులు కావాలని జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సఖీ కేంద్రం ఆద్వర్యంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న మహిళల వేధింపుల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ఇందులో జిల్లా సంక్షేమాధికారి డా.మిల్క, ప్రభుత్వ న్యాయవాది ముస్కు రమణారెడ్డి, చైల్డ్‌లైన్‌ కో ఆర్డినేటర్‌ జిమ్మ తిరుపతి, కార్యక్రమ నిర్వాహకురాలు, సఖీ కేంద్రం కో ఆర్డినేటర్‌ యశోధ, తదితరులున్నారు.

జిల్లాలో రెండు కరోనా పాజిటివ్‌

జిల్లావ్యాప్తంగా మంగళవారం రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో 335 మందిని పరీక్షించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా ఎనిమిది మంది ఐసోలేషన్‌కు, ముగ్గురు రిమ్స్‌కు చికిత్స నిమిత్తం తరలించినట్లు తెలిపారు.  

శతాధిక వృద్ధురాలికి వ్యాక్సిన్‌

ఇచ్చోడ రూరల్‌: కొవిడ్‌-19 నివారణ కోసం ఇచ్చోడ మండలంలో వైద్య శాఖ సిబ్బంది గ్రామంలో పర్యటిస్తూ వ్యాక్సిన్‌లు వేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం మండలంలోని జామిడి, గేర్జం గ్రామాలలో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్‌లు వేశారు. కాగా, జామిడి గ్రామంలో102 ఏళ్ల సూర్యవంశీ గౌబాయి అనే వృద్ధురాలికి వైద్య సిబ్బంది కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేశారు. ఇందులో వైద్యాధికారి డా.సాగర్‌ ఎంపీడీవో రాంప్రసాద్‌, సర్పంచ్‌ సుభాష్‌పాటిల్‌, ఏఎన్‌ఎం కమల, ఆశా కార్యకర్త సవిత, తదితరులు పాల్గొన్నారు.

నేరడిగొండ: ఒమైక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి చెందక ముందే కరోనా వ్యాక్సినేష న్‌ మొదటి, రెండో డోస్‌ వంద శాతం పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారి రవిశంకర్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు వడూర్‌ గ్రామంలో కరోనా వ్యాక్సిన్‌పై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. 

ఇచ్చోడ: 18ఏళ్లు నిండిన ప్రతీఒక్కరు వ్యాక్సిన్‌ తప్పనిసరి వేసుకోవాలని ఎంపీడీవో రాంప్రసాద్‌ అన్నారు. మండల కేంద్రంలో గల ఇస్లాంపురా, మజీద్‌ గల్లీ, మార్కెట్‌ కాలనీలలో కొవిడ్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు.

తలమడుగు:కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఈ నెలాఖరుకల్లా మండలంలో వందశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని తహసీల్దార్‌ ఇమ్రాన్‌ఖాన్‌ కోరారు. మంగళవారం మండలంలోని కొత్తూరు, తలమడుగు, బరంపూర్‌, ఝరి తదితర గ్రామాల్లో చేపడుతున్న వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. 

Updated Date - 2021-12-08T06:29:31+05:30 IST