Abn logo
Sep 25 2021 @ 01:30AM

వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలి

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల మున్సిపాలిటీలో ఈ  ఆర్థిక సంవ త్సరం ఆస్తి పన్ను వంద శాతం వసూలు కావాలని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశిం చారు. శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో అభివృద్ధి పనులు, వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. సిరిసిల్ల పట్టణ ప్రజలకు  ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రగ తిలో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాల న్నారు. వీఽధిలైట్లు నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. పట్టణంలో వివిధ ప్రభుత్వ గ్రాంట్లతోపాటు టీయూ ఎఫ్‌ఐడీసీ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పను లు పూర్తి చేయాలని ఆదేశించారు. పారిశుధ్యం ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని, నాటిన మొక్కలు సం రక్షించాలని అన్నారు. హరితహారంలో పట్టణ ప్రకృతి వనాలు అధికంగా ఏర్పాటు చేయాలన్నా రు. సిరిసిల్లలో బృహత్‌ పట్టణ ప్రకృతి వనం ఏ ర్పాటు కోసం ఐదెకరాల భూమిని గుర్తించి కేటా యించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలో శిథిలావస్థకు చేరిన విద్యుత్‌ స్తంభా లస్థానంలో కొత్తవి  వేయాలని సెస్‌ అధికా రులను ఆదేశించారు.  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, సెస్‌ఎండీ రామకృష్ణ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి అన్సారీ, మున్సిపల్‌, సెస్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.