నూరుశాతం పన్నులు వసూలు చేయాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-08-13T10:06:14+05:30 IST

మునిసిపాలిటీల్లో ఇంటి, నీటి పన్నులు వందశాతం వసూలు చేయాలని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈనెల 16 నుంచి వారం పాటు

నూరుశాతం పన్నులు వసూలు చేయాలి: కలెక్టర్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌, ఆగస్టు 12: మునిసిపాలిటీల్లో ఇంటి, నీటి పన్నులు వందశాతం వసూలు చేయాలని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈనెల 16 నుంచి వారం పాటు కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి కమిషనర్లను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బడ్జెట్‌ ప్రణాళికలు, ఇంటి, నీటి పన్నులు, విద్యుత్తు బకాయిలు, హరిత హారం, పారిశుధ్యం, వీధివ్యాపారాల నిర్వహణకు జోన్స్‌ ఏర్పాటుపై కమిషనర్లు, ప్రత్యేక అధికా రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప ట్టణా లు అభివృద్దికి సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు క లెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్‌, మునిసిపల్‌ చైర్మన్లు సీతాలక్ష్యీ, వెంకటేశ్వర్లు, కమిషనర్లు సంపత్‌ కుమార్‌, శ్రీకాంత్‌, శ్రీనివాసరెడ్డి, వెంకటస్వామి, ప్రత్యేక అధికారి ఆర్డీవో స్వర్ణలత పాల్గొన్నారు.

Updated Date - 2020-08-13T10:06:14+05:30 IST