Advertisement
Advertisement
Abn logo
Advertisement

వంద శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలి


అదనపు కలెక్టర్‌  కుమార్‌ దీపక్‌

ధర్మారం, డిసెంబరు 6: వంద శాతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌  కుమార్‌ దీపక్‌ సూచించారు. సోమవారం ధర్మారం మండల పరిషత్‌ కార్యాలయంలో వ్యాక్సినేషన్‌పై అధికారులతో అదనపు కలెక్టర్‌ సమీక్షించారు. అనంతరం నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్‌ను పరీశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఓటర్‌ జాబితాను పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ వేయాలని ఆయన సూచించారు. కరోనా బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. కొవిడ్‌పై ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించి వ్యాక్సినేషన్‌ వేయాలని ఆయన సూచించారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో అధికారులు పరీశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. అదేవిధంగా ప్రతీ గ్రామంలో ఇంటి పన్ను వసూలు చేయాలని ఆయన సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఆయన వెంట ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ఎంపీడీవో జయశీల, వైద్యాధికారి సంపత్‌, ఎంపీవో కిరణ్‌, ఏపీవో రవీందర్‌, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. 


Advertisement
Advertisement