వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

ABN , First Publish Date - 2021-12-07T04:26:23+05:30 IST

మన అందరి ముందున్నది ఒక టే లక్ష్యం, ప్రణాళిక బద్ధంగా అన్ని గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు అన్నారు.

వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకట్రావు

- కలెక్టర్‌ వెంకట్రావ్‌

- అధికారులకు దిశ నిర్దేశం

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, డిసెంబరు 6:  మన అందరి ముందున్నది ఒక టే లక్ష్యం, ప్రణాళిక బద్ధంగా అన్ని గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు అన్నారు. సోమవారం రెవెన్యూ సమావేశమందిరంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ లక్ష్య సాధన కోసం అన్నిశాఖల అధికారులు అవిశ్రాంతం గా పని చేయాలని  ఆదేశించారు. ప్రతీ గ్రామంలో ఉదయం 8గంటల నుంచి రాత్రి8 గంటల వరకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుండాలని  ఆదేశించా రు.  సబ్‌ సెంటర్లు, మునిసిపల్‌ వార్డుల ప్రత్యేకాధికారుల జాబితాను చదివి వి నిపించాలని సంబంధిత అధికారిని ప్రశ్నించగా తడబడుతూ వివరాలను చె ప్పలేకపోయారు. దీంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే ఎలా అని, మీపై సీఎస్‌కు రిపోర్టు చేస్తానని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో వ్యా క్సినేషన్‌ లక్షాన్ని చేరుకోవాలని ఆదేశించారు. బాధ్యతలను మరిచి ఇష్టాను సా రంగా వ్యవహరిస్తున్నారని, ఇక మీదట తప్పుచేసిన వారిని వదిలేది లేదన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.  

 ప్రజావాణికి 67 ఫిర్యాదులు

తహసీల్దార్‌ స్థాయిలో పరిష్కారం అయ్యే ఫిర్యాదులను కూడా కలెక్టర్‌ దగ్గరకు వెళ్లండి అని చెప్పడంపై కలెక్టర్‌ వెంకట్రావ్‌ విస్మయం వ్యక్తం చేశారు.  సోమవారం రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్ర మంలో కలెక్టర్‌  ప్రజల నుంచి 67 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ మండల స్థాయి సమస్యలు స్థానికంగానే పరిష్కరిం చాలని, ఇకమీదట ఇలా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. అంతకుముందు రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు మాట్లాడు తూ ధరణి పోర్టల్‌ పెండింగ్‌ల పై ఆరా తీశారు.  

Updated Date - 2021-12-07T04:26:23+05:30 IST