వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-12-02T06:57:58+05:30 IST

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 1: ప్రజలను చైతన్యపరుస్తూ వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్లు, విద్య, వైద్యం, పంచాయతీ, మున్సిపల్‌

వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 1: ప్రజలను చైతన్యపరుస్తూ వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్లు, విద్య, వైద్యం, పంచాయతీ, మున్సిపల్‌ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త వేరియంట్‌ భారీన పడకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అర్హులైన ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకునే విధంగా శాఖల సమన్వయంతో, ప్రణాళికలతో వందశాతం వ్యాక్సిన్‌ జరగాలన్నారు. రాష్ట్రంలో 90 శాతం మొదటి డోసు, 46 శాతం రెండో డోసు అందించడం జరిగిందని, ఈనెల 31 నాటికి వంద శాతం వ్యాక్సిన్‌పంపిణీ జరగాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా గ్రామాలు, వార్డులు పర్యటించి ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. వాయిస్‌ మెసేజ్‌ల ద్వారా చైతన్యం చేయడంతో పాటు మొదటి డోసు అనుభవాలు,  ఎదుర్కొన్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని థర్డ్‌వేవ్‌కు సన్నద్ధం కావాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దనిక, అలాంటి వాటిపై కలెక్టర్లు స్పందించాలని కోరారు. రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే ప్రతీ సమాచారాన్ని ప్రసార మాధ్యమాలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో ప్రజల వద్దకు చేరే విధంగా విస్త్రృత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గతంలో వైరస్‌ సోకనప్పటికీ భయంతో మరణాలు జరిగాయన్నారు. ప్రతీ జిల్లాలో 24/7 టోల్‌ ప్రీ నెంబర్‌ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచాలని, యుద్ధప్రాతిపదికన మిషన్‌ మోడులో వ్యాక్సిన్‌ అందించాలన్నారు. విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ విద్యాలయాలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు వ్యాక్సిన్‌ అందించాలని, వైద్య శాఖాధికారులు అందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా, డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌, డీఆర్డీఏ కిషన్‌, డీఈవో ప్రణీత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-02T06:57:58+05:30 IST