వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-12-04T05:51:18+05:30 IST

మండలంలో వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ వైద్య సిబ్బందిని ఆదేశించారు.

వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి
వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ

ముత్తారం డిసెంబర్‌ 3: మండలంలో వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వప్రాథమిక ఆసుపత్రిని కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఓడెడ్‌ గ్రామంలో పర్యటించారు. ప్రజలకు వ్యాక్సినేషన్‌ను అందించడంలో జిల్లాలోనే ముత్తారం మండలం వేనుకంజలో ఉందని వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లోని సబ్‌సెంటర్‌లలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని, ఉదయం వేళల్లో ప్రజలు పొలం పనులకు వెళుతు న్నారని వైద్య సిబ్బందికి కలెక్టర్‌కు వివరించారు. తాము ఇండ్లలోకి వెళ్లినా ప్రజలు ఉండడం లేదని, దీంతో వ్యాక్సినేషన్‌ ఆలస్యం అవుతోందని వారు తెలిపారు. దీంతో కలెక్టర్‌ సాయం త్రం వేళల్లో ప్రజలకు వ్యాక్సినేషన్‌ వేయాలని, అవస రం అయితే మండల కేంద్రంలో బస ఏర్పాట్లు చేసు కోవాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు వంద శాతం వ్యా క్సినేషన్‌ అందించాలని ఆదేశించారు. ఓడెడ్‌ గ్రామంలో ఉపాధిహామీ పథకం ద్వారా ఏర్పాటు చేసిన నర్సరీని కలెక్టర్‌ సంగీత సత్యనారా యణ సందర్శించి మొక్కల పెరుగుదలను పరిశీలిం చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ మొక్కలను పంపిణీ చేయనున్నట్లు వారు పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీ వో వేణుమాదవ్‌, సర్పంచ్‌ బక్కారావు, వైద్యాధికారి వంశీకృష్ణలు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-04T05:51:18+05:30 IST