వంద క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-08-13T10:42:26+05:30 IST

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధి పరకాల శివారులో డంప్‌ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని వరంగల్‌ టాస్క్‌ఫోర్క్‌ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు

వంద క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

వరంగల్‌ అర్బన్‌ క్రైం, ఆగస్టు 12: వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధి పరకాల శివారులో డంప్‌ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని వరంగల్‌ టాస్క్‌ఫోర్క్‌ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు వ్యక్తుల నుంచి సుమారు వంద క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. ఆ వివరాలను టాస్క్‌ఫోర్క్‌ సీఐ బానోతు నందిరాం నాయక్‌ మీడియాకు వెల్లడించారు. ‘పరకాల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని అల్లిబాద్‌ గ్రామ ప్రభుత్వ హైస్కూల్‌లో ప్రజల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి డంప్‌ చేసిన బియ్యాన్ని లారీలలో లోడు చేస్తున్నట్టు పక్కా సమాచారం అందింది.


దీంతో తమ సిబ్బందితో పాటు పరకాల పోలీసులతో మూకుమ్మడిగా దాడి చేసి వంద క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నాము. బియ్యం వ్యాపారం చేస్తున్న వారిలో రేగొండ మండలం చిన్నకోడెపాక గ్రామానికి చెందిన కక్కెర్ల నాగరాజు, రేగుల సాంబయ్య, కక్కెర్ల సదానందం, నూనె సది, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం ధర్మారం గ్రామానికి చెందిన మారపెల్లి వేణు, పరకాలకు చెందిన మౌటం రాజు ఉన్నారు. వారిలో మారపెల్లి వేణు దొరికిపోగా మిగతావారు పరారయ్యారు. ఈ దాడులలో మూడు ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలతో పాటు ట్రాక్టర్‌, సెల్‌ఫోన్‌తో సహా మొత్తంగా రూ. 2.30 లక్షల విలువైన బియ్యం పట్టుకున్నాం’ అని సీఐ తెలిపారు. ఈ దాడులలో టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందితో పాటు పరకాల ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారని ఆయన వివరించారు.

Updated Date - 2020-08-13T10:42:26+05:30 IST