యూర్‌పలో ఒకలా.. ఇండియాలో మరోలా

ABN , First Publish Date - 2021-01-26T07:26:22+05:30 IST

యూరప్‌ వినియోగదారులతో పోలిస్తే భారత వినియోగదారులతో వాట్సాప్‌ భిన్నంగా వ్యవహరిస్తోందని.. భారత వినియోగదారులపై

యూర్‌పలో ఒకలా.. ఇండియాలో మరోలా

వాట్సాప్‌ భిన్నంగా వ్యవహరిస్తోంది: ఢిల్లీ హైకోర్టులో కేంద్రం


న్యూఢిల్లీ, జనవరి 25: యూరప్‌ వినియోగదారులతో పోలిస్తే భారత వినియోగదారులతో వాట్సాప్‌ భిన్నంగా వ్యవహరిస్తోందని.. భారత వినియోగదారులపై కొత్త గోప్యతా విధానాన్ని ఏకపక్షంగా రుద్దడం ఆందోళనకరమని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. వాట్సాప్‌ సంస్థ ఇటీవలే తన గోప్యతా విధానానికి మార్పులు చేసిన విషయంపై ఒక న్యాయవాది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది.  కేంద్రం తరఫున వాదించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌శర్మ.. తమ డేటాను ఫేస్‌బుక్‌ అనుబంధ సంస్థలు/ఉత్పత్తులతో పంచుకోకుండా ఉండే ప్రత్యామ్నాయాన్ని భారత వినియోగదారులకు ఇవ్వలేదని, యూరప్‌ వినియోగదారులకు ఇచ్చిందని తెలిపారు. 

Updated Date - 2021-01-26T07:26:22+05:30 IST