మరొకరికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-06-05T10:15:35+05:30 IST

డయాలసిస్‌ వైద్యసేవల కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వెళ్లిన ఓ వ్యక్తి కరోనా బారిన పడ్డాడు.

మరొకరికి పాజిటివ్‌

ఖమ్మం జిల్లాలో 24కు చేరిన కరోనా కేసులు

‘డయాలసిస్‌’ కోసం హైదరాబాద్‌ వెళ్లిన వ్యక్తికి లక్షణాలు


ఖమ్మంసంక్షేమవిభాగం, జూన్‌ 4: డయాలసిస్‌ వైద్యసేవల కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వెళ్లిన ఓ వ్యక్తి కరోనా బారిన పడ్డాడు. ఖమ్మంనగరంలోని పాండురంగాపురం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతుండటంతో.. 15రోజుల క్రితం డయాలసిస్‌ చేయించేందుకు హైదరాబాద్‌ తీసుకెళ్లారు. అక్కడ వైద్యసేవలు పొందుతున్న క్రమంలో సదరు వ్యక్తికి లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది.


దీంతో రాష్ట్రస్థాయి వైద్యాధికారులు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తమం చేశారు. వెంటనే అధికారుల బృందం పాండురంగాపురంలోని కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి నివాసానికి వెళ్లి వివరాలు సేకరించారు. కుటుంబసభ్యులు, హైదరాబాద్‌ ఆసుపత్రికి వెళ్లి సదరు వ్యక్తిని పరామర్శించిన వారిని హోం క్వారంటైన్‌లో ఉంచినట్టు వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికే జిల్లాలో 23పాజిటివ్‌ కేసులు నమోదవగా గురువారం నమోదైన ఒక కేసుతో ఆ సంఖ్య 24కు చేరింది. అలాగే పాజిటివ్‌ నమోదైన వ్యక్తి నివాసం, క్వారంటైన్‌కు పంపిన వారి ఇళ్లకు వైద్యసిబ్బంది స్టిక్కర్లు అంటించారు. 

Updated Date - 2020-06-05T10:15:35+05:30 IST