Abn logo
Oct 24 2021 @ 23:42PM

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

మృతుడు పీర, గాయాలపాలైన మస్తానమ్మ

లింగాల, అక్టోబరు 24: ఇప్పట్ల గ్రామ స మీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చాగలరు వాసి వినుకొండ పీర (60) మృతిచెందగా అతని భార్య మ స్తానమ్మ తీవ్ర గాయాలపాలైంది. లింగాల ఎస్‌ఐ హృషికేశ్వర్‌రెడ్డి కథనం మేరకు వివ రాల్లోకెళితే... చాగలేరు వాసులు భార్య మ స్తానమ్మతో కలిసి పీరా గుణకనపల్లెలో జరుగుతున్న శుభకార్యంలో పాల్గొని తిరిగి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో వెళ్తున్నా రు.

కాగా ఇప్పట్ల క్రాస్‌రోడ్డు వద్ద ఓవర్‌ టేక్‌ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ద్వి చక్ర వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో పీరతలపై వాహనం టైరు ఎక్కడం తో తల నుజ్జునుజ్జు అయింది. అతని భార్య మస్తానమ్మకు చేయి విరిగి గాయాల పాలైంది. స్థానికులు ఇచ్చిన సమాచాంతో 108 సిబ్బంది మస్తానమ్మను కడప రిమ్స్‌ కు తరలించగా పీరా మృతదేహాన్ని పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు.